Bread on Empty Stomach: మీరు ఖాళీ కడుపుతో బ్రెడ్ తింటే ఏమవుతుందో తెలుసా?

Bread on Empty Stomach: ఈ బిజీ లైఫ్‌లో త్వరత్వరగా పనవుతుందని కొందరు, ఇది లైట్‌ ఫుడ్‌లే అని మరి కొందరు ఉదయం ఖాళీ కడుపున బ్రెడ్‌ తింటారు. ఇది ఆరోగ్యకరమే అనుకుంటారు. అయితే ఉదయం ఖాళీ కడుపున బ్రెడ్‌ తింటే ఏమవుతుందో తెలుసా?
 

1 /5

ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌లో బ్రెడ్‌ తినేవారు చాలా మంది ఉంటారు. ముఖ్యంగా ఇది మన ఆహారంలో భాగం. అయితే ఇలా తరచు ఖాళీ కడుపుతో బ్రెడ్‌ను అల్పాహారంగా తీసుకుంటే ఆరోగ్యానికి హానికం. ఇది ఆరోగ్యకరమైందని అని అనుకుంటారు. కానీ ఖాళీ కడుపుతో బ్రెడ్‌ తినడం వల్ల తింటే శరీరానికి హాని కలిగిస్తుంది.  

2 /5

మనం ఉదయం తీసుకునే బ్రెడ్ శరీరంలోని గ్లూకోజ్‌గా విడిపోయే కార్బోహైడ్రేట్‌లతో తయారవుతుంది. ఖాళీ కడుపుతో తీసుకుంటే గ్లూకోజ్ వేగంగా రక్తంలో కలిసి పోతుంది. డయాబెటీస్‌ ఉన్నవారికి కూడా చక్కెర స్థాయిలు హఠాత్తుగా పెరిగిపోతాయి.   

3 /5

అంతేకాదు మీరు ఖాళీ కడుపుతో ఉదయం బ్రెడ్‌ తింటే జీర్ణక్రియను నెమ్మదిస్తుంది. దీని వల్ల మీకు మలబద్ధకం సమస్య రావచ్చు. ఎందుకంటే ఇది మైదా కాబట్టి ఇలా పరగడుపున తీసుకోవడం అనారోగ్యం.   

4 /5

వెయిట్ లాస్‌ జర్నీలో ఉన్నవారు బ్రెడ్‌ అస్సలు తినకూడదు. ఎందుకంటే దీంతో బరువును పెంచుతుంది. నిజానికి బ్రెడ్‌ తినడాన్ని ప్రోత్సహిస్తుంది. అంటే అతిగా తినాలనే కోరిక కలుగుతుంది. ఇది మీ బరువు పెరిగేలా చేస్తుంది.  

5 /5

ముఖ్యంగా ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌లో బ్రెడ్‌ తినడం మానుకోండి. ఎందుకంటే ఖాళీ కడుపుతో బ్రెడ్‌ తింటే మీ జీర్ణక్రియను నెమ్మదిస్తుంది. దీని వల్ల మీకు కడుపు సంబంధిత సమస్య రావచ్చు. (Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం. వీటిని పాటించే ముందు వైద్య సలహా తీసుకోవాలి. ఈ సమాచారాన్ని Zee Media ధృవీకరించలేదు)