Whatsapp Secret Feature: వాట్సాప్‌లో ఎవ్వరికి తెలియని దిమ్మతిరిగే ఫీచర్స్‌.. మీరు కూడా తెలుసుకోండి!

Latest Whatsapp Feature: నేటి డిజిటల్ యుగంలో వాట్సాప్ అనేది మన జీవితాలలో ఒక అంతర్భాగమైపోయింది. ఇది కేవలం ఒక యాప్ మాత్రమే కాదు మనం మన ప్రియమైనవారితో, స్నేహితులతో, కుటుంబ సభ్యులతో మాట్లడడానికి ఉపయోగించే ఒక ముఖ్యమైన ఫీచర్‌. అయితే వాట్సాప్ రోజురోజుకూ మారుతూ మనకు కొత్త కొత్త ఫీచర్లను అందిస్తూనే ఉంటుంది. ఈ మధ్య వచ్చిన కొన్ని కొత్త ఫీచర్లు జనాలను పిచ్చి ఎక్కిస్తున్నాయి. ఇంతకీ ఈ ఫీచర్‌ ఏంటి? దీని ఎలా ఉపయోగించాలి? అనే వివరాలు వెంటనే మీరు కూడా తెలుసుకోండి.

1 /7

ప్రస్తుతం వాట్సాప్‌లో ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లు వస్తున్నాయి. ఈ ఫీచర్స్‌  వాట్సాప్‌ని మరింత  సౌకర్యవంతంగా, ఆసక్తికరంగా మారుస్తున్నాయి. ఇప్పటికే పోల్స్, అనౌన్స్‌మెంట్‌లు, గ్రూప్ డిస్కషన్‌లు మొదలైన ఫీచర్స్‌  గ్రూప్‌లను మరింత సమర్థవంతంగా నిర్వహించేలా చేస్తున్నాయి.  

2 /7

 వాట్సాప్ యూజర్ల ప్రైవసీని మరింత పెంచడానికి  ఇప్పటికే చాట్ లాక్ ఫీచర్ ని తీసుకువచ్చింది. ఈ ఫీచర్‌ను ఉపయోగించి మనకు కావాల్సిన వారి చాట్స్‌ను లాక్‌ చేసుకోవచ్చు.   

3 /7

దీని కోసం మీరు మీ వాట్సాప్‌ ఓపెన్‌ చేసిన కావాల్సిన చాట్‌పైన క్లిక్‌ చేయాల్సి ఉంటుంది. తరువాత కుడివైపు ఉన్న (:) క్లిక్‌ చేసి చాట్‌ లాక్‌ను చేయాలి. ఆ తరువాత పాస్వర్డ్ క్రియేట్ చేసుకుంటే చాట్‌ లాక్‌ అవుతుంది. 

4 /7

అయితే కొన్నిసార్లు వాట్సాప్‌ చాట్స్‌ను కిందకు స్వైప్ చేసినప్పుడు చాట్‌ లాక్‌ కనిపిస్తుంది. దీని వల్ల మన పాస్వర్డ్‌ తెలిసినవారు చాట్స్‌ను తెరిచే అవకాశం ఉంటుంది. ఈ విషయాన్ని దృష్టిలోకి తీసుకొని వాట్సాప్‌ మరో కొత్త ఫీచర్‌ను తీసువచ్చింది.

5 /7

ఈ కొత్త ఫీచర్‌ ఉపయోగిస్తే మీరు లాక్ చేసిన చాట్‌ ఎవరికి కనిపించదు. ముఖ్యంగా ఈ ఫీచర్‌ యువతకు ఎంతో ఉపయెగపడుతుందని చెప్పవచ్చు. దీని కోసం మీరు కొన్నిసెట్టింగ్స్‌ చేయాల్సి ఉంటుంది. 

6 /7

సింపుల్‌గా మీరు లాక్‌ చేసిన చాట్‌ మీద క్లిక్‌ చేయండి. ఇప్పుడు పైన ఉన్న (:) క్లిక్‌ చేయండి. ఆ తరువాత చాట్ లాక్‌ సెట్టింగ్స్‌ ఆప్షన్ ను ఓపెన్‌ చేయండి. మీకు హైడ్ లాక్‌ చాట్‌ అనే ఒక ఆప్షన్  కనిపిస్తుంది. దీని క్లిక్‌ చేయండి. 

7 /7

ఆ తరువాత ఒక కోడ్‌ను సెట్‌ చేసుకోవాల్సి ఉంటుంది. అంతే మీ చాట్‌ ఇకపైన కిందకు స్వైప్ చేసిన కూడా కనిపించదు. మీరు ఓపెన్‌ చేయాలంటే సెర్చ్ మీద మీ కోడ్‌ ఎంటర్ చేస్తే సరిపోతుంది. ఈ ఫీచర్‌ మీకు నచ్చితే మీరు కూడా ఈ ఫీచర్‌ను ట్రై చేయండి. ఒక వేళ ఈ ఫీచర్‌ కనిపించకపోతే వాట్సాప్‌ను అప్‌డేట్‌ చేయండి.