Bollywood drug addict Celebrities:
పేరుకే సెలబ్రిటీల జీవితం అందంగా వెలుగు జిలుగులతో కనిపిస్తుంది. కానీ నిజానికి ఆ కాంతి వెనుక ఉండే కొన్ని చేదు నిజాలు చాలా తక్కువగా బయటకు వస్తూ ఉంటాయి. బాలీవుడ్ లో స్టార్ స్టేటస్ అనుభవిస్తున్న పలు సెలబ్రిటీలలో.. డ్రగ్స్ మద్యానికి బానిసలుగా మారిన వారు కూడా ఉన్నారు. అందులో కొందరి గురించి ఇప్పుడు చూద్దాం..
సంజయ్ దత్ జీవిత చరిత్ర ఆధారంగా వచ్చిన సంజు సినిమా చూసిన వారందరికీ.. సంజయ్ దత్ డ్రగ్స్ కి మద్యానికి బానిస అని తెలుసు. అయితే చాలాకాలం ఆయన రీహబిలేషన్ కి వెళ్లి తన వ్యసనాలను మార్చుకుని తిరిగి సినిమాలోకి వచ్చిన సంగతి కూడా అందరికీ తెలిసిందే.
ఒకప్పుడు అందాల తారగా మెరిసిన మనీషా కొయిరాలాకి మద్యం ఒక వ్యసనంలా మారింది. ఈ విషయాన్ని స్వయంగా మనీషా తన పుస్తకంలో కూడా రాశారు. మద్యానికి బానిస అవడం ఆమె ఆరోగ్యాన్ని ఎలా ప్రభావితం చేసిందో కూడా ఆమె వివరించారు.
2001లో ఫర్దీన్ ఖాన్ డ్రగ్స్ కి బానిస అయ్యారు. దాని నుంచి బయటపడటానికి రీహబిలేషన్ కి కూడా వెళ్లారు. చాలాకాలం తర్వాత తన వ్యసనాలను మానుకొని చెడు అలవాట్ల నుంచి బయటపడ్డారు.
ఎప్పుడూ నవ్వుతూ అందరినీ నవ్విస్తూ ఉండే ప్రముఖ కమెడియన్ కపిల్ శర్మ జీవితంలో కూడా ఒక చీకటి కోణం ఉంది. కెరియర్లో ఎన్నో సమస్యలను ఎదుర్కొన్న కపిల్ శర్మ మద్యం బానిసత్వం నుంచి కూడా చాలా కష్టపడి బయటకు వచ్చి.. మళ్లీ ఇండస్ట్రీలో నిలదొక్కుకోగలిగారు.
ఒకప్పటి స్టార్ హీరో అయిన ధర్మేంద్ర దాదాపు 15 ఏళ్ల పాటు మద్యానికి బానిస కూడా. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. ఎంతో పాపులారిటీ ఉన్న సెలబ్రిటీలు.. ఇలా డ్రగ్స్ లేదా మద్యానికి బానిస అవుతూ.. తమ కెరియర్ తో పాటు జీవితాలను కూడా వృధా చేసుకున్నారు.