Siddhi Vinayaka temple: ప్రతిష్టాత్మక సిద్దివినాయక ఆలయం ఎక్కడ ఉంది? ఏ సమయంలో ఎలా సందర్శించాలి?

Siddhi Vinayaka temple: నేడు నినాయక చవితి ఈ సందర్భంగా మన దేశంలోని వివిధ ప్రాంతాల్లో ప్రతిష్టాత్మక గణేశ దేవలయాలు ఉన్నాయి. అందులో సిద్ధివినాయక ఆలయం ఎంతో పేరుప్రఖ్యాతలు గాంచింది. ఇక్కడికి చాలామంది సెలబ్రిటీలు కూడా వస్తుంటారు. మీరు కూడా సిద్ధివినాయక ఆలయం వెళ్లాలంటే ఎలా వెళ్లాలో తెలుసుకుందాం.
 

1 /6

నిన్న బాలీవుడ్‌ బ్యూటీ దీపికా పదుకొణే దంపతులు కూడా ఈ సిద్ధి వినాయక ఆలయాన్ని సందర్శించారు. ఈ నెలలోనే దీపికా రణ్‌వీర్‌లు తమ ఫస్ట్‌ బేబీకి స్వాగతం పలకనున్నారు. ఈ సందర్భంగా వీరు వినాయక చవితి ముందు రోజు సిద్ధి వినాయక ఆలయాన్ని సందర్శించి ఆదిదేవుని ఆశీర్వాదాలు తీసుకున్నారు.  

2 /6

ఈరోజు శనివారం సెప్టెంబర్‌ 7 నుంచి వినాయక నవరాత్రులు ప్రారంభం కానున్నాయి. పురాణాల ప్రకారం ఈ రోజు శివపార్వతులకు గణేషుడు జన్మించాడు. అయితే, మన దేశంలో వివిధ ప్రాంతాల్లో వినాయక చవితి ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. సెలబ్రిటీలు సైతం వెళ్లే కొన్ని ఆలయాలు ఉన్నాయి.  

3 /6

సిద్ధివినాయక ఆలయం ఎలా వెళ్లాలి? ప్రతిష్టాత్మక సిద్ధివినాయక ఆలయం దేశంలోనే అతిపురాతన ఆలయం. ఇది మహారాష్ట్రలో ఉంది. ఇక్కడికి నేరుగా అన్ని మార్గాలు ఉన్నాయి. దేశంలోని ప్రధాన నగరాల నుంచి రైలు, విమానం మార్గాలు ఉన్నాయి. ఇక్కడికి సులభంగా చేరుకోవచ్చు.

4 /6

ఒక వేళ మీరు హైదరాబాద్‌ నుంచి సిద్ధివినాయక ఆలయం వెళ్లాలనుకుంటే ఇక్కడి నుంచి నేరుగ ముంబైకి విమానం బుక్ చేసుకుంటే అక్కడి నుంచి కేవలం 18 కీమీ దూరంలో ఈ ఆలయం ఉంటుంది. మీరు ఎయిర్‌పోర్టు నుంచి క్యాబ్‌ లేదా ఏదైనా పబ్లిక్‌ ట్రాన్స్‌పోర్టును కూడా ఆశ్రయించవచ్చు.  

5 /6

రైలు మార్గంలో వెళ్లాలంటే ఇది మరింత సులభం ఛత్రపతి శివాజి టెర్మినల్‌ రైల్వే స్టేషన్‌ చేరుకోవాలి. అక్కడి నుంచి మీరు క్యాబ్‌ లో వెళ్లవచ్చు. అక్కడ దగ్గరలో దాదర్‌ రేవాలే స్టేషన్‌ కూడా ఉంటుంది. రోడ్డు మార్గంలో వెళ్లేవారు కూడా ఉన్నారు. ఈ ఆలయం దర్శించుకోవడానికి ఉదయం 5 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు సమయం ఉంటుంది.   

6 /6

ఎక్కువశాతం మంది మంగళవారం జరిగే హారతిలో పాల్గొంటారు. ఈరోజు ఉదయం 3:15 నుంచి రాత్రి 10 గంటల వరకు మొత్తం ఆరు రకాల హారతులు నిర్వహిస్తారు. శ్రీ దర్శన, కాకడ, నేవేద్య, రాత్రి ప్రార్థన, ఆరతి తర్వాత ఆలయం మూసివేస్తారు. ఈ ఆలయంలో రెండు గేట్లు ఉంటాయి. సిద్ధి, రిద్ధిగేట్‌లు ఉంటాయి. రిద్ధి గేట్‌ నుంచి వెళ్లడానికి రుసుము చెల్లించాలి. సిద్ధి గేట్‌ ద్వారా ఉచిత దర్శనం చేసుకోవచ్చు. మహిళా, దివ్యాంగులకు ప్రత్యేక క్యూలైన్లు ఉంటాయి.