White Hair Remedies: డైట్ ఇలా మార్చితే తెల్ల జుట్టు శాశ్వతంగా నల్లబడటం ఖాయం ఆ విటమిన్ లోపమే కారణం

White Hair Remedies: ఇటీవలి కాలంలో కేశ సంబంధిత సమస్యలు అధికమయ్యాయి. తక్కువ వయస్సుకే జుట్టు తెల్లబడటం లేదా రాలిపోవడం ప్రధానంగా కన్పిస్తోంది. ఆఖరికి 25-30 ఏళ్ల వయస్సులోనే ఈ సమస్య వెంటాడుతోంది. జెనెటిక్ కూడా ఓ కారణమైనా అత్యధిక శాతం కాలుష్యం, వాతావరణం, వివిధ రకాల ఆహారపు అలవాట్లు, జీవనశైలి మాత్రమే. అంటే ఈ సమస్యకు పరిష్కారం కూడా మన చేతుల్లోనే ఉందని. ఆ వివరాలు మీ కోసం..

White Hair Remedies: చెడు ఆహారపు అలవాట్లు, చెడు జీవనశైలితో పాటు వాతావరణ కాలుష్యం, నీటి కాలుష్యం హెయిర్ ఫాల్, వైట్ హెయిర్ కు కారణమౌతున్నాయి. హెల్తీ ఫుడ్స్ తీసుకోవడమే ఈ సమస్యకు పరిష్కారం. అన్ని రకాల పోషకాలుండే ఆహార పదార్ధాలే తీసుకోవల్సి ఉంటుంది. తక్కువ వయస్సుకే జుట్టు తెల్లబడటానికి కారణం విటమిన్ లోపమేనంటున్నారు వైద్య నిపుణులు

1 /5

విటమిన్ బి ముఖ్యంగా 7 రకాలుగా ఉంటుంది. ఇందులో థయామిన్ విటమిన్ బి1, రిబోఫ్లెవిన్ విటమిన్ బి2, నయాసిన్ విటమిన్ బి3, ప్యాంటోథెనిక్ యాసిడ్ విటమిన్ బి5, బయోటిన్ విటమిన్ బి7, ఫోలేట్ విటమిన్ బి9, కోబాలమిన్ విటమిన్ బి12 ఉన్నాయి.

2 /5

విటమిన్ బి ఎక్కువగా ఉండే ఆహార పదార్ధాల్లో గుడ్లు, సోయాబీన్, పెరుగు, ఓట్స్, పాలు, పన్నీర్, బ్రోకలీ, రొయ్యలు, చేపలు, చికెన్, సాల్మన్ చేప, ఆకు కూరలు, తృణ ధాన్యాలు తీసుకోవాల్సి ఉంటుంది. ఈ జాబితాలో ఉండే పదార్ధాల్లో రోజుకో రకం డైట్ లో ఉంటే మంచిది.

3 /5

తక్కువ వయస్సుకే జుట్టు తెల్లబడటం, హెయిర్ ఫాల్ సమస్యలుంటే వెంటనే విటమిన్ బి, విటమిన్ బి6, విటమిన్ బి12 ఎక్కువగా ఉండే ఆహార పదార్ధాలు డైట్ లో ఉండేట్టు చూసుకోవాలి. ముఖ్యంగా పాల ఉత్పత్తుల్లో, మాంసాహారంలో విటమిన్ బి ఎక్కువగా ఉంటుంది. 

4 /5

ఎందుకంటే విటమిన్ బి సెల్ మెటబోలిజం, రెడ్ బ్లడ్ సెల్స్ సింథసిస్ ప్రక్రియలో అత్యంత కీలకపాత్ర పోషిస్తుంది. అందుకే మనం తీసుకునే ఆహారం ఎప్పుడూ పోషకాలతో మెండుగా ఉండేట్టు చూసుకోవాలి. ప్రత్యేకించి విటమిన్ బి ఎక్కువగా ఉండే ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి.

5 /5

విటమిన్ బి అనేది అత్యంత కీలకమైంది. ఈ విటమిన్ ప్రభావం నేరుగా కేశాలతో ఉంటుంది. ఈ విటమిన్ లోపిస్తే తక్కువ వయస్సులోనే జుట్టు తెల్లబడటంతో పాటు హెయిర్ ఫాల్ సమస్య వెంటాడుతుంది.