White Hair Solution Tips in Telugu: ప్రస్తుతం మారుతున్న ఆహారపు అలవాట్లతో చాలా మంది చిన్న వయసులోనే తెల్ల జుట్టు సమస్యతో ఇబ్బంది పడుతున్నారు. తెల్ల జుట్టు కనిపించకుండా ఉండేందుకు హెయిర్ కలర్స్ ఉపయోగిస్తూ.. ఇతర సమస్యలను కొని తెచ్చుకుంటున్నారు. అయితే ఇంట్లో లభించే వస్తువులతోనే తెల్ల జుట్టును ఎలా నివారించవచ్చో ఇక్కడ తెలుసుకోండి.
ఆవాల నునె, మందార పువ్వును ఉపయోగించి తెల్ల జుట్టును నల్లగా మార్చుకోవచ్చు.
ఒక కప్పు మందార పువ్వులు, 2 కప్పుల ఆవాల నూనె తీసుకోవాలి.
మందార పువ్వును బాగా కడిగి ఆరబెట్టండి. మరోవైపు గ్యాస్‌పై ఆవాల నూనె వేసి వేడి చేయాలి. అనంతరం వేడి నూనెలో మందార పువ్వు వేసి మరిగించండి.
పువ్వులు బాగా మరిగించిన తరువాత వడకట్టి నూనెను చల్లర్చండి. ఈ నూనెను శుభ్రమైన సీసాలో పోయండి.
మీరు స్నానానికి వెళ్లే ముందు ఈ నూనెను జుట్టుకు రాసుకుని.. కాసేపు మసాజ్ చేయండి. దీంతో నూనె జుట్టు మూలాలకు చేరుతుంది.
ఆ తరువాత ఒకటి, రెండు గంటలు అలానే ఉంచండి. తేలికపాటి షాంపుతో స్నానం చేయండి. ఇలా వారానికి 2-3 సార్లు ఉపయోగిస్తే.. మీ జుట్టు నల్లగా మారిపోతుంది.
గమనిక: ఇక్కడ అందజేసిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే. జీ తెలుగు న్యూస్ ఈ విషయాన్ని ధృవీకరించలేదు. ఈ టిప్స్ పాటించే ముందు తప్పకుండా వైద్యుల నింపుణుల సలహా తీసుకోండి.