Naga Chaitanya: అన్నపూర్ణ స్టూడియోస్ లో నాగచైతన్య పెళ్లి.. వెనుక పెద్ద కథే..!

Naga Chaitanya wedding : నాగచైతన్య, శోభిత వివాహం.. ప్రస్తుతం ట్రెండ్ అవుతోంది. ఈ ఇద్దరు ఎప్పుడు వివాహం చేసుకుంటారు..ఎక్కడ వివాహం చేసుకుంటారు అనే పలు విషయాల గురించి సూచన మిరియాలు చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో ఇప్పుడు ఈ పెళ్లి గురించి ఒక వార్త బయటకురావడం గమనర్హం.
 

1 /5

నాగ చైతన్య, శోభితా ధూళిపాళాల వివాహం ప్రస్తుతం అభిమానులలో, సినీ వర్గాలలో చర్చగా మారింది. అయితే, తాజా సమాచారం ప్రకారం, ఈ జంట వివాహ వేడుకను అన్నపూర్ణ స్టూడియోస్‌లో నిర్వహించబోతున్నారని తెలుస్తోంది.   

2 /5

ఈ నిర్ణయం తీసుకోవడానికి పలు కారణాలున్నాయి. ముఖ్యంగా, నాగ చైతన్య తాత అక్కినేని నాగేశ్వరరావు (ఏఎన్‌ఆర్)కి గల ఆత్మీయ స్మరణార్ధంగా.. ఈ చోటుని అక్కినేని ఫ్యామిలీ వారు.. అనుకోవడం వల్ల.. ఇక్కడే నాగచైతన్య పెళ్లి జరపాలి అనుకుంటున్నట్లు తెలుస్తోంది.

3 /5

అన్నపూర్ణ స్టూడియోస్, అక్కినేని కుటుంబానికి ఎంతో ప్రత్యేకమైన ప్రదేశం. ఏఎన్‌ఆర్ భారతీయ సినిమాకి చేసిన ప్రాముఖ్యతను గుర్తుచేసుకునే.. ప్రదేశంగా ఈ స్టూడియో నిలిచింది. స్టూడియోలో ఏఎన్‌ఆర్ విగ్రహం కూడా ఉంది. ఇలా పలు కారణాల వల్ల ఇక్కడే పెళ్లి చేయాలని అక్కినేని కుటుంబం సంకల్పంతో ఉన్నారట. 

4 /5

నాగ చైతన్య తన కొత్త జీవితం ప్రారంభం చేయడానికి ఈ ప్రత్యేకమైన స్థలాన్ని ఎన్నుకోవడం ద్వారా తాత ఆశీర్వాదం పొందుతారని అక్కినేని ఫ్యామిలీ వారి నమ్మకం.వివాహ తేదీ ఇంకా అధికారికంగా ప్రకటించకపోయినా, ఈ సంవత్సరం చివర్లో వివాహ వేడుక జరగవచ్చని అనుకుంటున్నారు. 

5 /5

అయితే, ఈ సమాచారంపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. ఇది గ్రాండ్ వేడుక కంటే సన్నిహిత వాతావరణంలో కుటుంబ సభ్యులతో.. జరగవచ్చని సమాచారం. దీపావళి సందర్భంగా చైతు, శోభిత ఈ మధ్య.. అక్కినేని కుటుంబంతో కలిసి పండుగను ఘనంగా జరుపుకున్నారు. ఇక ఈ జంట ఈ సంవత్సరంలో ఆగస్టు 8న హైదరాబాద్‌లో నిశ్చితార్థం చేసుకున్నారు.