Most Dangerous Places: ప్రపంచంలోనే అతి భయంకరమైన 5 ప్రదేశాలు, ఒకసారి వెళితే సజీవంగా రాలేరు

పంచంలో మనకు తెలియని వింతలు, విశేశాలు, ప్రమాదకర ప్రాంతాలు, భయం గొలిపే ప్రదేశాలు చాలానే ఉన్నాయి. కొన్ని ప్రదేశాలకు వెళితే తిరిగి ప్రాణాలతో వెనక్కి రాలేరు. కొన్ని మిస్టరీ ప్రాంతాలు కూడా ఉన్నాయి. ఇలాంటి ప్రాంతాలకు వెళ్లే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవాల్సిందే. లేదంటే సజీవంగా వెనక్కి రాలేరు.

Most Dangerous Places: పంచంలో మనకు తెలియని వింతలు, విశేశాలు, ప్రమాదకర ప్రాంతాలు, భయం గొలిపే ప్రదేశాలు చాలానే ఉన్నాయి. కొన్ని ప్రదేశాలకు వెళితే తిరిగి ప్రాణాలతో వెనక్కి రాలేరు. కొన్ని మిస్టరీ ప్రాంతాలు కూడా ఉన్నాయి. ఇలాంటి ప్రాంతాలకు వెళ్లే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోవాల్సిందే. లేదంటే సజీవంగా వెనక్కి రాలేరు.

1 /5

బెర్ముడా ట్రయాంగిల్ ఇది ప్రపంచంలో అత్యంత చర్చనీయాంశమైన, వింతైన మిస్టరీ ప్రాంతం. బెర్ముడా ట్రయాంగిల్ ఉత్తర అట్లాంటిక్ మహా సముద్రంలోని ఓ ప్రాంతమిది. ఈ ప్రాంతం సరిహద్దు కచ్చితంగా తెలియదు. కానీ ఫ్లోరిడా, ప్యుటోరికా, బెర్ముడా మధ్యలో ఉన్న ట్రయాంగిల్ ప్రాంతం. ఏళ్ల తరబడి ఈ ప్రాంతంలో ఓడలు, విమానాలు అదృశ్యమౌతున్న ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఎలా అదృశ్యమౌతున్నాయి, ఏమౌతున్నాయనేది ఇప్పటికీ అంతు చిక్కని రహస్యంగానే మిగిలింది

2 /5

ఓయిమాయికోన్, రష్యా రష్యా రాజధాని మాస్కోకు తూర్పు దిశలో సైబీరియాకు మధ్యలో ఉంటుంది ఈ ప్రాంతం. ప్రపంచంలో అత్యంత చల్లని ప్రాంతం. ఇక్కడ నమోదైన అతి తక్కువ ఉష్ణోగ్రత మైనస్ 71.2 డిగ్రీల సెల్సియస్, అతికష్టంగా ఇక్కడ ఓ 500 మంది నివసిస్తుంటారు. ఇక్కడి వాతావరణం ఎంత భయంకరంగా ఉంటుందంటే మరుసటి రోజు వరకూ ప్రాణాలతో ఉంటే ఆశ్చర్యపడాలి.

3 /5

డనాకిల్ ఎడారి, తూర్పు ఆఫ్రికా తూర్పు ఆఫ్రికాలోని డనాకిల్ ఎడారి ఇథియోపియాలోని నార్త్ ఈస్ట్ , ఇరిట్రియాకు దక్షిణంలో జిబూతీకు నార్త్ వెస్ట్ దిశలో విస్తరించి ఉంది. అగ్ని పర్వతాలతో నిండి ఉంటుంది.దీన్నించి విషపూరితమైన గ్యాస్ వెలువడుతుంటుంది. అత్యధిక వేడి ఉంటుంది. మనిషి తట్టుకోలేని వేడి పుడుతుంది. అందుకే ఈ ఎడారిని కూడా అత్యంత ప్రమాదకరమైన ప్రాంతంగా పరిగణిస్తారు. ఇక్కడ పగటి ఉష్ణోగ్రత 50 డిగ్రీలు దాటుతుంటుంది. 

4 /5

స్నేక్ వరల్డ్ , బ్రెజిల్ బ్రెజిల్ దేశంలోని స్నేక్ వరల్డ్ ప్రాంతమిది. దేశంలోని సావో పావులో తీరానికి సమీపంలో ఉంది. ఈ ప్రాంతాన్ని అత్యంత విషపూరిత పాములకు పుట్టిల్లుగా భావిస్తారు. భూమ్మీద మరెక్కడా కన్పించని అత్యంత ప్రమాదకరకమైన గోల్డెన్ లాన్స్ హెడ్ వైపర్ ఇక్కడే ఉంటు్ంది. దీని విషం ఎంత ప్రమాదకరమైందంటే మనిషి మాంసాన్ని కూడా కరిగించేస్తుంది. ఈ పాము గురించి ఆలోచిస్తేనే ఒళ్లు గగుర్పొడుస్తుంది. అందుకే ఈ ప్రాంతం నిషిద్ధంగా ప్రకటించింది

5 /5

డెత్ వ్యాలీ, కాలిఫోర్నియా ఈ డెత్ వ్యాలీలోనే భూమిపై అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది. 1913 జూలై 10వ తేదీన 56.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఈ ప్రాంతం ఉత్తర అమెరికాలోని నిర్జన ప్రదేశం.అందుకే ఈ ప్రాంతాన్ని డెత్ వ్యాలీ అంటారు. చలికాలంలో అత్యధికంగా చలి ఉంటుంది. 

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x