World Tallest Mosques: ప్రపంచంలో అతి ఎత్తైన 5 మసీదులు ఇవే

ప్రపంచంలో ఒకదానిని మించి ఒకటి పెద్ద మసీదులున్నాయి. ఇస్లాంలో మక్కా నగరంలోని మసీదు ముస్లింలకు అత్యంత పవిత్రమైంది. రెండవ ప్రముఖ మసీదు మదీనా. మూడవది జెరూసలెంలో ఉన్న అల్ అక్సా మసీదు. ఇవి కాకుండా ప్రపంచంలోనే ఎత్తైన 5 మసీదుల గురించి తెలుసుకుందాం.

World Tallest Mosques: ప్రపంచంలో ఒకదానిని మించి ఒకటి పెద్ద మసీదులున్నాయి. ఇస్లాంలో మక్కా నగరంలోని మసీదు ముస్లింలకు అత్యంత పవిత్రమైంది. రెండవ ప్రముఖ మసీదు మదీనా. మూడవది జెరూసలెంలో ఉన్న అల్ అక్సా మసీదు. ఇవి కాకుండా ప్రపంచంలోనే ఎత్తైన 5 మసీదుల గురించి తెలుసుకుందాం.

1 /5

అల్ ఫతహ్ గ్రాండ్ మస్జిద్ ఈ మసీదు బబ్రెయిన్ రాజధాని మనామాలో ఉంది.  ప్రపంచంలో నాలుగవ ఎత్తైన మసీదు. ఎత్తు 427 అడుగులు. 69,965 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది. ఒకేసారి 7 వేలమంది నమాజ్ చేయవచ్చు. 

2 /5

మొసల్లా మస్జిద్ ఈ మసీదు ఇరాన్‌లోని టెహ్రాన్‌లో ఉంది. ప్రపంచంలో మూడవ ఎత్తైన మసీదు. ఎత్తు 446 అడుగులు. నిర్మాణం 2006లో పూర్తయింది. 

3 /5

సుల్తాన్ సలాహుద్దీన్ అబ్దుల్ అజీజ్ మస్జిద్ దీనికి మరో పేరు బ్లూ మస్జిద్. మలేషియాలోని షాహ్ ఆలమ్ నగరంలో ఉంది. దేశంలోని అతి పెద్ద మసీదు ఇదే. ఇండోనేషియాలోని జకార్తా నగరంలో ఉన్న ఇస్తిక్‌లాల్ తరువాత దక్షిణ ఆసియాలో రెండవ అతిపెద్ మసీదు. ప్రపంచంలో రెండవ అతి ఎత్తైన మసీదు. ఎత్తు 460 అడుగులు. 1974లో నిర్మించారు. 

4 /5

హసన్ మస్జిద్ ఇది ప్రపంచంలోనే ఎత్తైన మసీదు. ఇది మొరాకోలోని కైసాంబ్లాంకాలో ఉంది. ఈ మసీదు మీనార్ల ఎత్తు 689 అడుగులు. మసీదుని బేయిగస్ నిర్మించాడు. డిజైన్ చేసి మైకెల్ పిన్సేవు. 1993లో నిర్మించిన ఈ మసీదు మీనార్ ఎత్తు 60 అంతస్తుల భవనం కంటే ఎక్కువ. మసీదు పైకప్పు వెనుకకు ముడుచుకుంటుంది. గరిష్టంగా 1,05,000 మంది నమాజు చేయవచ్చు. ఇందులో 25 వేలమందికి మసీదు హాలులోపల నమాజు చేసేందుకు అవకాశముంటుంది. 

5 /5

పుత్రా మస్జిద్ ఇది మలేషియాలోని పుత్రాజయ నగరంలో ఉంది. ఇది ప్రపంచంలోని ఐదవ ఎత్తైన మసీదు. ఎత్తు 380 అడుగులు. 15 వేలమంది నమాజు చేయవచ్చు.