World Dangerous Plances: మరణం ఎప్పుడొస్తుందనేది ఎవరికీ తెలియదు. కానీ ప్రపంచంలో కొన్ని ప్రాంతాలు చూస్తే మరణం అంటే ఏంటో గుర్తొస్తుంది. మరణ భయం వెంటాడుతుంది. ఈ ప్రాంతాలకు వెళ్లడమంటే ప్రాణం ఎప్పుడైనా పోతుందని అర్ధం.
World Dangerous Plances: అందుకే వీటిని ప్రపంచంలో అత్యంత భయంకరమైన, దారుణమైన మరణానికి కేరాఫ్‌గా నిలిచే ప్రదేశాలు. ప్రపంచంలో అత్యంత భయం గొలిపే ఆ 5 ప్రాంతాల గురించి వివరాలు మీ కోసం..
స్నేక్ ఐలాండ్ భూమిపై అతి ప్రమాదకరమైన ప్రదేశం ఇదే. సావో పౌలోకు 90 మైళ్ల దూరంలో ఉన్న ఈ ద్వీపంలో ప్రపంచంలోనే అత్యధికంగా పాములు నివాసముంటాయి. ప్రతి స్క్వేర్ మీటర్లో దాదాపు 5 పాములుంటాయి. ఈ పాములు ఎంత విషపూరితమంటే మనిషి మాంసం కూడా విషం ధాటికి కరిగిపోవల్సిందే.
మౌంట్ వాషింగ్టన్ అమెరికాలోని అతి భయంకరమైన ప్రదేశాల్లో ఒకటి. భూమిపై అత్యంత వేగంగా గాలి వీచేది ఇక్కడే. ఇక్కడ గాలుల వేగం గంటకు 203 కిలోమీటర్ల వరకూ ఉంటుంది. మౌంట్ వాషింగ్టన్లో మైనస్ 40 డిగ్రీల ఉష్ణోగ్రత కూడా నమోదవుతుంటుంది.
లేక్ నైట్రాన్ ఉత్తర టాంజేనియాలో అత్యంత భయంకరమైన ఉప్పు నీటి సరస్సు జంతువులి రాళ్లుగా మార్చేస్తుంది. లేక్ నైట్రాన్లో దిగగానే పక్షులు జంతువుల శరీరాలు మొత్తం పాడైపోతుంటాయి.
డెత్ వ్యాలీ పేరులోనే భయం రేపుతోంది. నేవాడా, కాలిఫోర్నియా మధ్య ఉన్న డెత్ వ్యాలీ ఉత్తర అమెరికాలో అతి లోతైన ప్రాంతం. దీనిని అక్కడ పాతాళంగా పిలుస్తారు. అత్యధిక ఉష్ణోగ్రత 56.7 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. ఈ డెత్ వ్యాలీలో 700 పౌండ్ల బరువైన కొండలు వాటంతటవే ఎలా కదులుతున్నాయనేది ఇప్పటికీ రహస్యమే
డానికల్ ఎడారి ఇథియోపియాలో ఉన్న ఈ ప్రాంతం ప్రపంచంలోనే అత్యంత వేడి కలిగిన ప్రదేశం. భూమిపై అత్యంత లోతులో ఉన్న ప్రాంతమిది. జ్వాలాముఖిలా వెదజల్లే లావా భయం గొలుపుతుంటుంది. ఈ ఎడారి ప్రాంతమంతా 10 లక్షల టన్నుల కంటే ఎక్కువ ఉప్పు కలిగి ఉంటుంది.