YS Sharmila: వైభవంగా వైఎస్‌ రాజారెడ్డి వివాహం.. డ్యాన్స్‌తో ఇరగదీసిన వైఎస్‌ షర్మిల

YS Sharmila Son Marriage Pics: రాజస్థాన్‌లోనూ జోధ్‌పూర్‌ ప్యాలెస్‌లో ఘనంగా వైఎస్సార్‌ మనవడు వైఎస్‌ రాజారెడ్డి వివాహం జరిగింది. ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల, బ్రదర్‌ అనిల్‌ కుమార్‌ల తనయుడు వైఎస్‌ రాజారెడ్డి వివాహం అట్లూరి ప్రియతో అట్టహాసంగా జరగ్గా ఈ వేడుకకు కుటుంబసభ్యులు, కొద్దిమంది బంధుమిత్రులు మాత్రమే హాజరయ్యారు. పెళ్లి వేడుకకు షర్మిల సోదరుడు ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ హాజరుకాకపోవడం గమనార్హం.

1 /8

రాజకీయ నాయకుల కోసం తెలంగాణలోని హైదరాబాద్‌లో లేదా ఏపీలోన ఒక ప్రాంతంలో రిసెప్షన్‌ నిర్వహించే అవకాశం

2 /8

అంగరంగ వైభవంగా జరిగిన వైఎస్‌ రాజారెడ్డి పెళ్లిలో డ్యాన్స్‌తో ఇరగదీసిన వైఎస్‌ షర్మిల

3 /8

షర్మిల సోదరుడు ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ ఈ వివాహ వేడుకకు హాజరుకాకపోవడం గమనార్హం.

4 /8

ఈ వివాహ వేడుకకు రాజకీయ ప్రముఖులకు ఆహ్వానం దక్కలేదని సమాచారం. కేవలం కుటుంబసభ్యులు, కొద్ది మంది బంధుమిత్రులు హాజరయ్యారు.  

5 /8

పెళ్లిలో ప్రత్యేక ఆకర్షణలో నిలిచిన ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల

6 /8

క్రైస్తవ, హిందూ మత పద్ధతిలో రెండు సార్లు వివాహ వేడుకలు జరిగాయి.

7 /8

మూడు రోజుల పాటు జరిగిన వైఎస్‌ రాజారెడ్డి అట్లూరి ప్రియ వివాహ వేడుకలు

8 /8

రాజస్థాన్‌లోనూ జోధ్‌పూర్‌ ప్యాలెస్‌లో ఘనంగా వైఎస్సార్‌ మనవడి వివాహం