OMG Video: వామ్మో...కి'లేడీ'! బంగారాన్ని ఇలా కూడా దొంగలిస్తారా? వీడియో వైరల్

Viral video: బంగారు దుకాణంలో ఓ మహిళ సింపుల్  ట్రిక్ ఉపయోగించి గోల్డ్ ను కాజేయడానికి ప్రయత్నించింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.   

Edited by - ZH Telugu Desk | Last Updated : May 18, 2022, 05:32 PM IST
OMG Video: వామ్మో...కి'లేడీ'! బంగారాన్ని ఇలా కూడా దొంగలిస్తారా? వీడియో వైరల్

Viral video: సోషల్ మీడియాలో (Social Media) రోజూ రకరకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. ఈ మధ్య దొంగతనాలకు సంబంధించి చిత్రవిచిత్రమైన వీడియోలు నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి. తాజాగా అలాంటి ఓ వీడియో ఇంటర్నెట్ ను షేక్ చేస్తోంది. ఒక మహిళ ఓ సింపుల్ ట్రిక్ ఉపయోగించి నగల దుకాణం నుండి బంగారాన్ని దొంగిలించడానికి ప్రయత్నించింది. ప్రస్తుతం ఈ వీడియో (Female Thief Video) నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది.

వీడియో ఓపెన్  చేస్తే.. ఓ జ్యువెలరీ షాపులో ఇద్దరు మహిళలను కూర్చోబెట్టి ఓ వ్యక్తి బంగారు ఆభరణాలను చూపిస్తూంటాడు. నల్లటి సూట్ ధరించిన స్త్రీ కొన్ని నెక్లెస్‌లు మరియు చిన్న బంగారు ఆభరణాలను చూస్తోంది. షాపు వాడు వీళ్లతోపాటు ఇతర కస్టమర్లను చూసుకోవడంలో బిజీగా ఉంటాడు. అతడు వెనుకకు తిరగ్గానే ఆ మహిళ ఓ బంగారు ముక్కను నోటిలో పెట్టుకుంది. ఆ మహిళ బంగారాన్ని మింగేసిందా.. లేక కేవలం నోటిలో దాచుకుందా అన్నది తెలియలేదు. 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by BKS 💕💗 (@memes.bks)

ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో 'memes.bks' అనే ఇన్ స్టాగ్రామ్ పేజీలో షేర్ చేశారు. ఇప్పటివరుకు 12,000 మందికిపైగా వీక్షించారు. 1,200 లైక్‌లు వచ్చాయి. ఆ వీడియో స్టోర్‌లోని సీసీటీవీ ఫుటేజీగా తెలుస్తోంది. బంగారాన్ని ఎంత తెలివిగా దొంగలించడాని్ని చూసి నెటిజన్లు షాక్ తిన్నారు. తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు. 

Also Read: Assam Floods: వరదలతో అసోం అతలాకుతలం.. నీట మునిగిన రైల్వే స్టేషన్, వీడియో వైరల్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook

Trending News