Pakistan Viral Video: ఫ్లై ఓవర్‌పై వరుసగా స్కిడై పడుతున్న బైక్‌లు.. సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌..!

Pakistan Viral Video: ఓ ఫ్లై ఓవర్‌పై వరుసగా బైక్‌లు స్కిడై పడుతున్న ఓ వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌ అయ్యింది. తడిగా ఉన్న రోడ్డుపై బ్రేక్‌ వేయగానే వరుసగా బైక్‌లు జారిపడ్డాయి. బైక్‌పై ఉన్నవాళ్లు కింద పడి పలువురు గాయపడ్డారు.

Written by - Pradeep | Last Updated : Jun 27, 2022, 12:16 PM IST
  • ఫ్లై ఓవర్‌పై వరుసగా స్కిడై పడుతున్న బైక్‌లు..
  • సోషల్‌మీడియాలో తెగ వైరల్‌..
  • షేక్‌పేట్ ఫ్లై ఓవర్ అని మరికొందరు తెగ సర్క్యులేట్
Pakistan Viral Video: ఫ్లై  ఓవర్‌పై వరుసగా స్కిడై పడుతున్న బైక్‌లు.. సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌..!

Pakistan Viral Video: ఓ ఫ్లై ఓవర్‌పై వరుసగా బైక్‌లు స్కిడై పడుతున్న ఓ వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌ అయ్యింది. తడిగా ఉన్న రోడ్డుపై బ్రేక్‌ వేయగానే వరుసగా బైక్‌లు జారిపడ్డాయి. బైక్‌పై ఉన్నవాళ్లు కింద పడి పలువురు గాయపడ్డారు. వర్షంతో ఫ్లై ఓవర్ పరిస్థితి ఇలా అయ్యిందంటూ సోషల్‌మీడియాలో దీనిపై ఒకటే చర్చ. ఈ ఫ్లైఓవర్ నవీముంబై కి చెందిందని కొందరు... హైదరాబాద్ షేక్‌పేట్ ఫ్లై ఓవర్ అని మరికొందరు తెగ సర్క్యులేట్ చేశారు.

తమ స్నేహితులు, సన్నిహితులు అటువైపు వెళ్లొద్దని జాగ్రత్తలు కూడా చెప్పారు. అసలు అలా ఫ్లై ఓవర్ పై వాహనాలు  జారిపడటానికి కారణం ఏంటనే సైంటిఫిక్ డిస్కషన్లు కూడా జరిగాయి వాట్సప్ గ్రూపుల్లో. ఏడాదంతా వాహనాల నుంచి జారిన ఆయిల్ రోడ్డుపై అతుక్కుపోయిందని.. వర్షం పడగానే ఆ నీరు ఇంకకుండా ఆయిల్ అడ్డుపడటంతో జారుడుగుణం ఏర్పడి వాహనాలు స్కిడ్డయ్యాయని కొందరు జడ్జిమెంట్ కూడా చేశారు. కాబట్టి వానాకాలం ప్రారంభంలో రోడ్డుపై వెళ్తుంటే జాగ్రత్తగా ఉండాలని సలహాలిచ్చారు. ఈ జడ్జిమెంట్‌లో నిజానిజాలు ఎలా ఉన్నా... అసలు ఘటన జరిగిన ఫ్లై ఓవర్ మాత్రం ఇండియాలో లేదు.

 

ఈ ఫ్లై ఓవర్ ఎక్కడుందన్నదానిపై ఫ్యాక్ట్ చెక్ జరిగింది. ఇందులో తేలింది ఏంటంటే ఈ వీడియో పాకిస్తాన్ కరాచీలోనిది. గతంలో ఎప్పుడో జరిగిన ఘటన తాలూకూ వీడియో ఇప్పుడు వైరల్ అయ్యింది. ఎవరికి వారు ఇది తమ ప్రాంతానికే చెందిందని వాట్సప్ గ్రూపుల్లో షేర్ చేశారు. ఈ వీడియోలో ఓ ఐదు సెకన్ల పాటు హోండా షోరూం కనిపిస్తుంది. ఈ షోరూం ఎక్కడిదని గూగుల్‌ లో సెర్చ్ చేయగా అది పాకిస్తాన్‌లోని కరాచీలో కనిపించింది. దీంతో ఈ వైరల్ కంటెంట్ అంతా అబద్దమని స్పష్టమైంది.

 

Also Read: Monsoon Health Tips: వర్షాకాలంలో ఈ పండ్లను తప్పకుండా తీసుకుంటే.. ఎలాంటి వ్యాధులు మీ చుట్టుముట్టవు..!

Also Read:  Monsoon Health Tips: వర్షాకాలంలో ఈ పండ్లను తప్పకుండా తీసుకుంటే.. ఎలాంటి వ్యాధులు మీ చుట్టుముట్టవు..!

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News