Kendra And Trikona In Astrology In Telugu: ప్రతి గ్రహం ఏదో ఒక సమయాన్ని బట్టి రాశి సంచారం చేస్తుంది. గ్రహాలు రాశుల సంచారం చేయడం కారణంగా మంచి చెడు ప్రభావాలు ఏర్పడుతూ ఉంటాయి అంతేకాకుండా ఒకే రాశులు వివిధ గ్రహాలు కలవడం కారణంగా కూడా ప్రత్యేక యోగాలు ఏర్పడుతూ ఉంటాయి. ఈ యోగాల ప్రభావం మొత్తం అన్ని రాశుల వారిపై సమానంగా పడుతుంది. ముఖ్యంగా ఈ ప్రత్యేక యోగాలు జాతకంలో శుభ స్థానంలో ఉంటే, జీవితంలో డబ్బుకు ఆనందానికి లోటు ఉండదు. అయితే మార్చి నెలలోని మొదటి వారంలోనే శుక్ర గ్రహం మీనరాశిలోకి సంచారం చేయబోతోంది. దీని కారణంగా కేంద్ర త్రికోణ రాజయోగం ఏర్పడబోతోంది. ఈ రాజయోగం కేవలం కొన్ని రాశుల వారిపై మాత్రమే ప్రభావం చూపుతుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. దీని కారణంగా కొన్ని రాశుల వారు విపరీతమైన లాభాలు పొందుతారు.
మిథున రాశి:
మిధున రాశి వారు ఈ త్రికోణ రాజయోగం ప్రభావం కారణంగా అదృష్టవంతులు అవుతారు. ఇంతకుముందు కష్టంగా ఉన్న పనులన్నీ ఈ సమయంలో సులభతరమవుతాయి అంతేకాకుండా ఈ సమయంలో గొప్ప విజయాలు సాధించేందుకు అదృష్టాన్ని కూడా పొందుతారు. అలాగే భవిష్యత్తులో డబ్బులు పొందడానికి కొత్త ప్రణాళికలు రచిస్తారు. ఇక వ్యాపారాలు చేస్తున్న వారికి ఈ సమయం చాలా లాభదాయకంగా ఉండబోతోంది. ఈ ప్రత్యేక యోగం కారణంగా తల్లి సపోర్టు లభించి, ఎలాంటి పనులైన ఎంతో ఆసక్తితో చేస్తారు. అంతేకాకుండా ఇంతకుముందు నుంచి ఎదుర్కొంటున్న సమస్యలన్నీ ఈ సమయంలో పరిష్కారం కాబోతున్నాయి.
కర్కాటక రాశి:
కర్కాటక రాశి వారికి ఈ సమయం చాలా శుభ్రంగా ఉండబోతోంది. ముఖ్యంగా ఈ సమయంలో ఆదాయం పెరగడం కారణంగా కొత్త ఆస్తులు లేదా వాహనాలు కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి. దీంతోపాటు కష్టపడి పనిచేయడం వల్ల విపరీతమైన ఆర్థిక లాభాలు పొందుతారు. ముఖ్యంగా ఈ సమయం విద్యార్థులకు చాలా అనుకూలంగా ఉండబోతోంది. ఇక ఉద్యోగాలు చేసేవారు ప్రమోషన్స్ పొందడమే కాకుండా కార్యాలయంలో మంచి పేరు ప్రతిష్టలు పొందుతారు. వ్యాపారాలు చేసేవారు పెద్దపెద్ద కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకొని ఊహించని ఆర్థిక లాభాలు పొందుతారు. ముఖ్యంగా ఈ కర్కాటక రాశి వారు రాజయోగం కారణంగా పోటీ పరీక్షలు రాయడం వల్ల సులభంగా విజయాలు సాధిస్తారు.
Also Read Ibomma Downloading Option: ఒకే నిమిషంలో ఐ బొమ్మలో మూవీస్ డౌన్లోడ్ చేయడం ఎలా?
కుంభ రాశి:
కుంభ రాశి వారికి ఈ సమయం చాలా శుభ్రంగా ఉండబోతోంది. ముఖ్యంగా ఏర్పడబోయే కేంద్ర త్రికోణ రాజయోగం వల్ల కొత్త ఆదాయ వనరులు పొందే అవకాశాలు కూడా ఉన్నాయి. దీంతోపాటు జీవితంలో ఎదురవుతున్న సమస్యల నుంచి కూడా సులభంగా ఉపశమనం లభిస్తుంది. అలాగే భాగస్వామ్య వ్యాపారాలు చేసేవారు ఊహించని పెట్టుబడులు పెట్టే అవకాశాలు కూడా ఉన్నాయి. అంతేకాకుండా ఆర్థికంగా లాభపడడమే కాకుండా సమాజంలో కీర్తి, ప్రతిష్టలు పొందుతారు. ముఖ్యంగా ఉద్యోగాలు చేసే వారికి ఈ సమయం ఎంత శుభ్రంగా ఉంటుంది. కాబట్టి ప్రమోషన్స్ పొందడమే కాకుండా ఊహించని లాభాలు పొందుతారు.
Also Read Ibomma Downloading Option: ఒకే నిమిషంలో ఐ బొమ్మలో మూవీస్ డౌన్లోడ్ చేయడం ఎలా?
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Facebook, Twitter