Sun Eclipse 2023: తొలి సూర్యగ్రహణం ఈ రాశులకు వరం.. ఇందులో మీరున్నారా?

Sun Eclipse 2023: మరో రెండు నెలల్లో సూర్యగ్రహణం ఏర్పడనుంది. దీని శుభ మరియు అశుభ ప్రభావం ప్రజలందరిపై ఉంటుంది. గ్రహణం వల్ల ఏయే రాశులవారు లాభపడనున్నారో తెలుసుకుందాం.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Feb 13, 2023, 12:53 PM IST
Sun Eclipse 2023: తొలి సూర్యగ్రహణం ఈ రాశులకు వరం.. ఇందులో మీరున్నారా?

Sun Eclipse 2023 effects on Zodiac signs: ఈ ఏడాది తొలి సూర్యగ్రహణం ఏప్రిల్ 10న రాబోతుంది. అదే  సమయంలో సూర్యభగవానుడు మేషరాశిలో సంచరిస్తాడు. భూమి మరియు సూర్యుని మధ్య చంద్రుడు వచ్చినప్పుడు.. సూర్యగ్రహణం ఏర్పడుతుంది. ఇది ఏప్రిల్ 10వ తేదీ ఉదయం 07:05 నుండి ప్రారంభమై మధ్యాహ్నం 12:29 వరకు కొనసాగుతుంది. ఇప్పుడు ఏర్పడబోయేది పాక్షిక సూర్యగ్రహణం. ఈ గ్రహణం భారతదేశంలో కనిపించదు. అయినా సరే ఇది మెుత్తం 12 రాశులవారిని ప్రభావితం చేస్తుంది. ఈ సోలార్ ఎక్లిప్స్ కొన్ని రాశులవారికి శుభప్రదంగా ఉంటుంది. 

సూర్యగ్రహణం ఈ రాశుల వారికి శుభప్రదం
వృషభం: ఈ ఏడాది ఏర్పడబోయే సూర్యగ్రహణం వృషభరాశి వారికి మేలు చేస్తుంది. మీరు కెరీర్‌లో అపారమైన ప్రయోజనాలు పొందుతారు. మీకు పెద్ద కంపెనీలో జాబ్ వచ్చే అవకాశం ఉంది. జీతంలో రెట్టింపు పెరుగుదల ఉంటుంది. వ్యాపారానికి కూడా ఈ సమయం అనుకూలంగా ఉంటుంది. 
మిథునం: మిథునరాశివారిపై సూర్యగ్రహణం సానుకూల ప్రభావం చూపుతుంది. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. వీరి కెరీర్‌ అద్భుతంగా ఉంటుంది. వ్యాపారం వేగంగా అభివృద్ధి చెందుతుంది. మెుత్తానికి ఈ సమయం మీకు అనుకూలంగా ఉంటుంది. 
ధనుస్సు: ఈ సూర్యగ్రహణం ధనుస్సు రాశి వారికి అదృష్టమనే చెప్పాలి. మీరు ప్రతి పనిలోనూ విజయం సాధిస్తారు. కుటుంబంలో సంతోషం నెలకొంటుంది. ఉద్యోగులకు, వ్యాపారులకు ఈ సమయం అద్భుతంగా ఉంటుంది. మెుత్తానికి ఈ సమయం సూపర్ గా ఉంటుంది. 

Also Read: Rahu Gochar 2023: త్వరలో రాహువు ఈ 3 రాశులను ఇబ్బంది పెట్టనున్నాడు.. ఇందులో మీరున్నారా? 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News