మాజీ భారత కెప్టెన్‌కి “హెచ్‌సీఏ” లో ఘోర అవమానం

హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ)పై భారత మాజీ కెప్టెన్ అజారుద్దీన్ మండిపడ్డారు.

Last Updated : Jan 8, 2018, 08:29 PM IST
మాజీ భారత కెప్టెన్‌కి “హెచ్‌సీఏ” లో ఘోర అవమానం

హైదరాబాద్, తెలంగాణ: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ)పై భారత మాజీ కెప్టెన్ అజారుద్దీన్ మండిపడ్డారు. తనను లోపల జరుగుతున్న సమావేశానికి ఎందుకు అనుమతించలేదని విరుచుకుపడ్డారు. ఉదయం రాజీవ్ గాంధీ క్రికెట్ స్టేడియంలో ప్రత్యేక సమావేశం జరిగింది. కానీ అజారుద్దీన్ లోపలికి వెళ్లకుండా గంటకుపైగా బయట నిలబడ్డారు. కాగా ఈ విషయం ఆలస్యంగా వెలుగుచూసింది. 

భారత క్రికెట్ మాజీ కెప్టెన్‌గా, ఒకసారి అసోషియేషన్‌కు ప్రాతినిధ్యం వహించినప్పుడు తనను లోనికి అనుమతించారని.. ఇప్పుడు ఎందుకు అనుమతించలేదని ఆయన ప్రశ్నించారు. హెచ్‌సీఏ సభ్యులపై అవినీతి ఆరోపణలను చేశారు. అసోసియేషన్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

దీనిపై హెచ్‌సీఏ ప్రెసిడెంట్ స్పందిస్తూ.. లోథా కమిటీ ఆదేశాల అనుసారం మీటింగ్ నిర్వహించామని.. మీటింగ్‌లో ఇంతకుముందు అమలైన 16 అంశాలు చర్చకు వచ్చాయని అన్నారు. తెలంగాణ క్రికెట్ అసోషియేషన్ (టీసీఏ)కు అజారుద్దీన్ మద్దతు ఇస్తున్నారని.. అందుకే ఆయనను సమావేశానికి అనుమతించలేదని చెప్పారు. అలాగే అజారుద్దీన్ పై తమకు గౌరవం ఉందని తెలిపారు.

Trending News