Avesh Khan Dedicates His Performance To His Father: ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా రాజ్‌కోట్ వేదికగా శుక్రవారం రాత్రి దక్షిణాఫ్రికాతో జరిగిన నాలుగో టీ20లో భారత్ 89 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ విజయంతో టీ20 సిరీస్ 2-2తో సమం అయింది. టీమిండియాకు కీలకమైన నాలుగో టీ20 విజయంలో యువ పేసర్ అవేష్ ఖాన్ నాలుగు వికెట్లు పడగొట్టి దక్షిణాఫ్రికా దెబ్బకొట్టాడు. తొలి మూడు మ్యాచ్‌ల్లో ఒక్క వికెట్ కూడా తీయలేకపోయిన అవేశ్.. ఈ మ్యాచ్‌లో 4/18తో అద్భుత ప్రదర్శన చేశాడు.
మ్యాచ్ అనంతరం మాట్లాడిన అవేశ్ ఖాన్ తన ప్రదర్శన పట్ల చాలా సంతోషంగా ఉందన్నాడు. ఈ ప్రదర్శన తన నాన్నకు అంకితం ఇస్తున్నట్లు చెప్పాడు. 'ఈ ప్రదర్శనతో చాలా సంతోషంగా ఉంది. మా నాన్న పుట్టినరోజు నేడు. నా అత్యుత్తమ ప్రదర్శనను ఆయనకు అంకితమిస్తున్నా. వికెట్లు తీయడానికే నేను ప్రణాళికలు రచించలేదు. సహజ సిద్ధంగా బౌలింగ్ చేసి వికెట్లకు బంతిని నేరుగా విసరాలనుకున్నా. ఈ పిచ్ బిన్నంగా ఉంది. బంతి కొన్నిసార్లు బౌన్స్ అయితే.. కొన్నిసార్లు కింద నుంచి వెళ్లింది. దీంతో కాస్తంత బౌన్స్ ప్రదర్శించి సరైన లెంగ్త్‌లో వేయాలనుకున్నా' అని అవేశ్ చెప్పాడు.
'కెప్టెన్ రిషభ్ పంత్ పరిస్థితులకు తగ్గట్టు ఎలా బౌలింగ్ చేయాలో చెప్పాడు. దాంతో మార్కో జాన్సెన్, కేశవ్ మహారాజ్‌ల వికెట్లు పడగొట్టా. జట్టుగా మేం బాగా ఆడుతున్నాం. ఫీల్డింగ్, బౌలింగ్ బాగా చేస్తున్నాం. రెండు వరుస ఓటములు ఎదురైనా అద్భుతంగా పుంజుకున్నాము. ఆఖరి మ్యాచ్‌ను కూడా ఆస్వాదించాలనుకుంటున్నాం. ఐదో మ్యాచులో ఎవరు గెలిస్తే వారిదే సిరీస్. మేం విజయం సాధించడానికి ప్రయత్నిస్తాం' అని అవేశ్ ఖాన్ ధీమా వ్యక్తం చేశాడు.
'నాలుగు మ్యాచ్‌ల్లో భారత జట్టు తుదిలో ఎలాంటి మార్పులు జరగలేదు. ఈ క్రెడిట్ మొత్తం టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ సార్‌కే దక్కుతుంది. ద్రవిడ్ సార్ ప్రతీ ఒక్కరికి అవకాశాలు ఇస్తారు. 1-2 మ్యాచ్‌ల్లో పేలవ ప్రదర్శన కనబర్చినప్పటికీ.. తరువాత మ్యాచ్‌లకు కూడా అవకాశం ఇస్తారు. ప్రతీ ఒక్కరికి తమను తాము నిరూపించుకోవడానికి ద్రవిడ్ సార్ అవకాశాలు ఇస్తారు' అని అవేశ్ చెప్పుకొచ్చాడు.
Also Read: Telugu Indian Idol : విన్నర్గా జూనియర్ పూజా హెగ్డే.. మెగాస్టార్ చిలిపి కవితలు!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook