పాక్ క్రికెట్ బోర్డుకు బీసీసీఐ షాక్; పరిహారం చెల్లించి తొకముడిచిన పీసీబీ

                       

Last Updated : Mar 19, 2019, 09:57 PM IST
పాక్ క్రికెట్ బోర్డుకు బీసీసీఐ షాక్; పరిహారం చెల్లించి తొకముడిచిన పీసీబీ

పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు  బీసీసీఐ షాక్ గట్టి షాక్ ఇచ్చింది. బీసీసీఐ గురిచూసిన కొట్టిన దెబ్బకు పాక్ క్రికెట్  బోర్డు పరిహారం చెల్లించాల్సి వచ్చింది. వివరాల్లోకి వెళ్లినట్లయితే...

భారత్‌ తమతో ద్వైపాక్షిక సిరీస్‌లు ఆడనందుకు భారీ నష్టం వాటిల్లిందని పీసీబీ అంతర్జాతీయ క్రికెట్ మండిలి (ఐసీసీ)లో దావా వేసింది. తమకు నష్టం జరిగిందున బీసీసీఐ తమకు పరిహారం కింద రూ.400 కోట్లకు పైగా చెల్లించాలని డిమాండ్ చేసింది. 

పాక్ గతేడాది వేసిన ఈ పిటిషన్ విచారణ జరిపిన ఐసీసీ వివాద పరిష్కార కమిటీ పాక్‌దే తప్పని తేల్చింది.  అనవసరంగా తమపై నిందలు వేసినందుకు విచారణకైన ఖర్చును చెల్లించాలని బీసీసీఐ తిరిగి పిటిషన్‌ వేసింది. భారత్ వేసిన పిటిషన్ కు ఐసీసీ ఆమోద ముద్ర వేసింది.  బీసీసీఐకి పాక్ క్రికెట్ బోర్డు 1.6 మిలియన్‌ డాలర్లు చెల్లించి తొక ముడిచింది

Trending News