Rathnam Movie Censor Talk: రత్నం మూవీతో ఆడియన్స్‌ను అలరించేందుకు రెడీ అయ్యాడు యాక్షన్ హీరో విశాల్. మాస్ డైరెక్టర్ హరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. వీరిద్దరి కాంబోలో వచ్చిన భరణి, పూజా సినిమాలు ఆడియన్స్‌ను అలరించాయి. మూడోసారి రత్నం మూవీతో ఈ కాంబో హ్యాట్రిక్ హిట్స్ కొట్టేసేందుకు వచ్చేస్తోంది. ట్రైలర్‌తో ఈ సినిమాపై అంచనాలు రెట్టింపు అయ్యాయి. జీ స్టూడియోస్, స్టోన్ బెంచ్ ఫిల్మ్స్ సంయుక్తంగా నిర్మించగా.. కార్తికేయన్ సంతానం ప్రొడ్యూసర్‌గా వ్యవహరించారు.ప్రియా భవానీ శంకర్ హీరోయిన్‌గా నటించింది. శ్రీ సిరి సాయి సినిమాస్ బ్యానర్‌పై తెలుగులో సీహెచ్ సతీష్ కుమార్, కె.రాజ్ కుమార్ విడుదల చేస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ మూవీ రేపు (ఏప్రిల్ 26) థియేటర్స్‌లో సందడి మొదలుపెట్టనుంది. తెలుగు, తమిళ్ భాషల్లో విడుదల కానుంది.
Also Read: Massive Fire In Patna: పాట్నాలో ఘోర అగ్నిప్రమాదం.. 6 గురు సజీవదహానం.. అసలేం జరిగిందంటే..?
రత్నం మూవీ నుంచి రిలీజ్ చేసిన సాంగ్స్, ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇక ఇటీవల విడుదల చేసిన ఎటువైపో ఎటువైపో.. అంటూ సాగిన సాంగ్ శ్రోతలను మెప్పించింది. దేవీ శ్రీ ప్రసాద్-విశాల్ కాంబోలో మొదటి సినిమా కావడంతో మ్యూజిక్ లవర్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ మూవీలో సాంగ్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. తాజాగా రత్నం మూవీకి సెన్సార్ బోర్డు నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చింది. సెన్సార్ బోర్డు మెంబర్స్ సినిమాను వీక్షించి U/A సర్టిఫికెట్‌ను జారీ చేశారు. ఈ సినిమాలో యాక్షన్‌తో పాటు చక్కని మెసేజ్ ఉందని.. కుటుంబ సమేతంగా చూడదగ్గ చిత్రమని మెచ్చుకున్నారు.
ఈ మూవీపై హీరో విశాల్ గట్టి నమ్మకంతో ఉన్నారు. గతంలో హరితో చేసిన భరణి, పూజ సూపర్ హిట్ అయ్యాయని.. ఈ సినిమా కూడా హిట్ అవుతుందని భావిస్తున్నామని చెప్పారు. దేవీశ్రీప్రసాద్ అందించిన సంగీతం అలరిస్తుందన్నారు. ప్రియా భవానీ శంకర్ క్యారెక్టర్ ఈ సినిమాకు ప్రాణం అని.. ప్రేక్షకులు పెట్టే డబ్బులకు సరిపడా వినోదం ఇస్తామని గ్యారంటీ ఇచ్చారు. కచ్చితంగా పైసా వసూల్ సినిమా అవుతుందని ధీమా వ్యక్తం చేశారు.
Also Read: Renault Kiger Price: టాటా పంచ్‌తో పోటీ పడుతున్న Renault Kiger.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇలా!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి