రాజ్‌‌కోట్‌ టెస్ట్‌: 181 పరుగులకు వెస్టిండీస్‌ ఆలౌట్‌

రాజ్‌ కోట్‌ టెస్ట్‌: 181 పరుగులకు వెస్టిండీస్‌ ఆలౌట్‌

Updated: Oct 9, 2018, 10:01 PM IST
రాజ్‌‌కోట్‌ టెస్ట్‌: 181 పరుగులకు వెస్టిండీస్‌ ఆలౌట్‌

రాజ్‌కోట్ వేదికగా భారత్ వర్సెస్ వెస్టిండీస్‌ మధ్య తొలి టెస్టు మ్యాచ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. శనివారం తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో వెస్టిండీస్ జట్టు 181 పరుగులకు ఆలౌటైంది. దీంతో భారత్‌ 468 పరుగుల ఆధిక్యంలో ఉంది. కేవలం 48 ఓవర్లలోనే వెస్టిండీస్ ఆలౌట్ కావడం గమనార్హం. భారత బౌలర్లు అశ్విన్ నాలుగు వికెట్లు తీసుకోగా.. సమీ రెండు వికెట్లు, కుల్దీప్, జడేజా, ఉమేశ్‌లు చెరో వికెట్ తీసుకున్నారు. విండీస్ జట్టులో అత్యధికంగా చేజ్ 53, పాల్ 47 పరుగులు చేశారు. భారత్ తన తొలి ఇన్నింగ్స్‌లో 9 వికెట్ల నష్టానికి 649 పరుగులు డిక్లేర్డ్ చేసిన సంగతి తెలిసిందే.

 

తొలి ఇన్నింగ్స్‌లో 468 పరుగులు వెనకబడి ఉన్న వెస్టిండీస్ ప్రస్తుతం ఫాలో ఆన్ ఆడుతున్న‌ది. కడపటి వార్తలందేసరికి వెస్టిండీస్ తన రెండో ఇన్నింగ్స్‌లో 40.4 ఓవర్లలో 7  వికెట్లు కోల్పోయి 172 పరుగులు చేసింది. కే పాల్ (15) జడేజా బౌలింగ్‌లో ఉమేశ్ యాదవ్‌కి క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.