Banks Alert: బ్యాంకుల విలీనం నేపధ్యంలో ఖాతాదారులు తప్పకుండా గుర్తుంచుకోవల్సిన విషయాలు చాలానే ఉన్నాయి. అందుకే పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఆ నిబంధనలకు సంబంధించి కీలక ప్రకటన చేసింది.
ఈఏడాది ఏప్రిల్ లో ఆరు ఎస్బిఐ అనుబంధ బ్యాంకులు మాతృసంస్థ ఎస్బిఐ విలీనం చేసుకున్న సంగతి తెలిసిందే.. 2017 డిసెంబర్ 31 నుంచి ఈ బ్యాంకులకు చెందిన పాత చెక్ బుక్ లు, ఐఎఫ్ఎస్సీ కోడ్ లు చెల్లవు.
ఎస్బీఐ విలీనం చేసుకున్న బ్యాంకుల ఖాతాదారులకు చెందిన పాత చెక్‌బుక్‌లు, ఐఎఫ్ఎస్సీ కోడ్లు ఇక చెల్లవు . దీనికి డిసెంబర్31 వరకు ఎస్బీఐ గడువు విధించింది. ఈ లోపు పాత చెక్ బుక్ మార్చుకోవాలని ఎస్బీఐ ఆయా ఖాతాదారులకు సూచించింది.
గతంలో పాత చెక్‌బుక్‌లను మార్చుకోవడానికి 2017 సెప్టెంబర్ 30న డెడ్‌లైన్‌గా గడువు విధించింది. అనంతరం ఆ గడువును డిసెంబర్ 31 వరకు పొడిగించిన సంగతి తెలిసిందే. గడువు దగ్గర పడుతున్న క్రమంలో ఎస్బీఐ మరోసారి తన కస్టమర్లకు ఈ సూచన చేస్తోంది.
By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.