/telugu/photo-gallery/allu-konidela-family-dispute-over-allu-aravind-meets-to-pawan-kalyan-with-tollywood-producers-rv-145114 Pawan Allu Aravind: పవన్‌ కల్యాణ్‌ భేటీలో అనూహ్య పరిణామం.. అల్లు అరవింద్‌ ప్రత్యక్షం Pawan Allu Aravind: పవన్‌ కల్యాణ్‌ భేటీలో అనూహ్య పరిణామం.. అల్లు అరవింద్‌ ప్రత్యక్షం 145114

 

Realme GT 6 Price Cut: ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ కంపెనీ రియల్‌ మీ గుడ్‌ న్యూస్‌ తెలిపింది. మార్కెట్‌లో Realme GT 6 స్మార్ట్‌ఫోన్‌ అందుబాటులోకి తీసుకు వచ్చింది. ఈ మొబైల్‌కు సంబంధించిన మొదటి సేల్‌ మంగళవారం ప్రారంభమైంది. ప్రస్తుతం ఇది ప్రముఖ ఈ కామర్స్‌ కంపెనీ ఫ్లిఫ్‌కార్ట్‌తో పాటు రియల్‌మీ ఇ-స్టోర్‌లలో లభిస్తోంది. రియల్‌మీ ఈ స్మార్ట్‌ఫోన్‌ మొట్ట మొదటి సారిగా AI ఫీచర్స్‌తో అందుబాటులోకి తీసుకువచ్చింది. అంతేకాకుండా ఈ మొబైల్‌ స్నాప్‌డ్రాగన్ 8S Gen 3 చిప్‌సెట్‌తో పాటు సూపర్-ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌ ఫీచర్‌ను కలిగి ఉంటుంది. ఇవే కాకుండా ఇందులో చాలా రకాల ప్రీమియం ఫీచర్స్‌ ఉండబోతున్నట్లు కంపెనీ వెల్లడించింది. అయితే ఈ స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌, ధర, డిస్కౌంట్‌ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

Realme GT 6 ధర, ఆఫర్స్‌ వివరాలు:
ప్రస్తుతం భారత మార్కెట్‌లో ఈ Realme GT 6 స్మార్ట్‌ఫోన్‌  మూడు స్టోరేజ్‌ వేరియంట్స్‌లో లభిస్తోంది. ఇందులోని బేస్‌ వేరియంట్‌ 8GB ర్యామ్‌, 256GB ఇంటర్నల్‌ స్టోర్‌తో లభిస్తోంది. ఇక మిడిల్‌ వేరియంట్‌  12GB ర్యామ్, 256GB స్టోరేజ్‌, టాప్‌ వేరియంట్‌ 16GB ర్యామ్‌, 512GB స్టోరేజ్‌ కాన్ఫిగరేషన్‌తో అందుబాటులో ఉంది. ఇక ఈ మొబైల్‌కు సంబంధించిన ధర వివరాల్లోకి వెళితే, దీని బేస్‌ వేరియంట్‌ రూ.42,999తో లభిస్తోంది. ఇక రెండవ వేరియంట్‌ రూ.44,999తో అందుబాటులో ఉంది. ఈ Realme GT 6 స్మార్ట్‌ఫోన్స్‌ ఫ్లూయిడ్ సిల్వర్, రేజర్ గ్రీన్ కలర్ ఆప్షన్‌లలో అందుబాటులోకి తీసుకు వచ్చింది.

అంతేకాకుండా ఈ Realme GT 6 స్మార్ట్‌ఫోన్స్‌పై మొదటి సేల్‌లో భాగంగా ప్రత్యేకమైన డిస్కౌంట్‌ ఆఫర్స్‌ కూడా లభిస్తున్నాయి. వీటిని వినియోగించి కొనుగోలు చేసేవారికి భారీ తగ్గింపు లభిస్తుంది. ఈ Realme GT 6 స్మార్ట్‌ఫోన్స్‌ను కొనుగోలు చేసే క్రమంలో ICICI బ్యాంక్, HDFC బ్యాంక్, SBI బ్యాంక్‌లకు సంబంధించిన బ్యాంక్‌ క్రెడిట్‌ కార్డ్‌ను వినియోగించి పేమెంట్‌ చేసేవారికి రూ. 4,000 వరకు తక్షణ తగ్గింపు లభిస్తుంది. అంతేకాకుండా ఈ స్మార్ట్‌ఫోన్స్‌పై ఉన్న ఎక్చేంజ్‌ ఆఫర్స్‌ను వినియోగించి బిల్‌ చెల్లించేవారికి అదనంగా రూ.1,000 వరకు ఎక్స్‌ఛేంజ్ బోనస్‌ను కూడా పొందవచ్చు. ఇవే కాకుండా ఈ స్మార్ట్‌ఫోన్‌ ఆకర్శనీయమైన EMI ఆప్షన్స్‌ కూడా లభిస్తున్నాయి. అవేంటో తెలుసుకోవడానికి ఫ్లిఫ్‌కార్ట్‌ లేదా రియల్‌మీ అధికారిక సైట్స్‌ను సందర్శించాల్సి ఉంటుంది.

Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!

Realme GT 6 ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌:
6.78-అంగుళాల పూర్తి-HD+ డిస్‌ప్లే
8T LTPO AMOLED డిస్‌ప్లే
1,264x2,780 పిక్సెల్స్‌ రిజల్యూషన్‌
120Hz రిఫ్రెష్ రేట్‌
4nm ఆక్టా-కోర్ స్నాప్‌డ్రాగన్ 
8s Gen 3 SoC ప్రాసెసర్ 
ట్రిపుల్ కెమెరా సెటప్‌
50MP సోనీ LYT-808 సెన్సార్‌ కెమెరా
8-మెగాపిక్సెల్ సోనీ IMX355 అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా
32-మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా 
120W ఛార్జింగ్ సపోర్ట్‌
5,500mAh బ్యాటరీ

Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Section: 
English Title: 
Realme Gt 6 Price Cut: Get Realme Gt 6 Discount Of Rs.5 Thousand In First Sale, Full Discount Details Dh
News Source: 
Home Title: 

Realme GT 6 Price Cut: మొదటి సేల్‌లో Realme GT 6 మొబైల్‌పై బంఫర్ డిస్కౌంట్‌.. ఎగబడి కొంటున్న జనాలు!

Realme GT 6 Price Cut: మొదటి సేల్‌లో Realme GT 6 మొబైల్‌పై బంఫర్ డిస్కౌంట్‌.. ఎగబడి కొంటున్న జనాలు!
Caption: 
source file- zee telugu news
Yes
Is Blog?: 
No
Tags: 
Facebook Instant Article: 
Yes
Mobile Title: 
మొదటి సేల్‌లో Realme GT 6 మొబైల్‌పై బంఫర్ డిస్కౌంట్‌.. ఎగబడి కొంటున్న జనాలు!
Dharmaraju Dhurishetty
Publish Later: 
No
Publish At: 
Tuesday, June 25, 2024 - 13:09
Created By: 
Cons. Dhurishetty Dharmaraju
Updated By: 
Cons. Dhurishetty Dharmaraju
Published By: 
Cons. Dhurishetty Dharmaraju
Request Count: 
1
Is Breaking News: 
No
Word Count: 
334