Kishan Reddy Meet with Pawan Kalyan: తెలంగాణలో బీజేపీ-జనసేన పొత్తు ఫైనల్ అయింది. శనివారం రాత్రి జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌తో కేంద్ర మంత్రి, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్, బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ ఛైర్మన్ డా.లక్ష్మణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో 32 స్థానాల్లో పోటీ చేయాలని భావించామని తెలిపారు. ఎన్డీయే భాగస్వామ్య పక్షంగా భారతీయ జనతా పార్టీతో చర్చలు చేశామన్నారు. సుహృధ్బావంగా చర్చిస్తున్నామని.. తాము పోటీ చేసే స్థానాలపై చర్చలు తదిదశకు వచ్చాయని తెలిపారు.
రెండు స్థానాల విషయంలో ఇంకా తేలాల్సి ఉందని.. దీనిపై మరోసారి మాట్లాడుకుంటామన్నారు. తమ పార్టీ పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ ఈ అంశాన్ని సమన్వయం చేస్తున్నారని చెప్పారు. ఇటీవల ఎన్డీయే మీటింగ్‌లో కూడా ఈ దేశానికి మరోసారి నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా ఉండాల్సిన ఆవశ్యకత గురించి మాట్లాడామమన్నారు. ఈ దేశానికి ముచ్చటగా మూడోసారి మోడీ రధాని కావాలని ఆకాంక్షిస్తున్నామని.. ఇందుకు అనుగుణంగా ముందుకు వెళతామన్నారు. ఈ నెల 7వ తేదీన హైదరాబాద్‌లో బీజేపీ నిర్వహించే బహిరంగ సభలో మోడీ పాల్గొంటున్నారని.. ఈ సభకు తాను కూడా హాజరవుతానని చెప్పారు.
కిషన్ రెడ్డి మాట్లాడుతూ.. ఏన్డీయే భాగస్వామ్య పక్షంగా ఉన్న జనసేన పార్టీ తమకు జీహెచ్ఏంసీ ఎన్నికల్లో ఎంతో సహకరించిందని తెలిపారు. ఇందుకు పవన్ కల్యాణ్‌కు కృతజ్ఞతలు చెప్పారు. ఇప్పుడు జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికలు ఎంతో కీలకమైనవని.. తెలంగాణకు డబుల్ ఇంజన్ సర్కార్ అవసరం ఉందన్నారు. జనసేనతో సీట్ల సర్దుబాటు చర్చలు ఒక కొలిక్కి వచ్చాయని.. రెండు సీట్ల అంశంపై చర్చించాల్సి ఉందన్నారు. ఈ నెల 7వ తేదీన ఎల్బీ స్టేడియంలో నిర్వహించే బహిరంగ సభలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పాల్గొంటారని.. ఈ సభకు పవన్ కల్యాణ్‌ను ఆహ్వానించామన్నారు.
Also Read: 7th Pay Commission: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డబుల్ గిఫ్ట్.. డీఏ పెంపు కొత్త లెక్కలు ఇలా..!
Also Read: Free Ration Scheme: రేషన్ కార్డు హోల్డర్లకు గుడ్‌న్యూస్.. మరో ఐదేళ్లు పొడగింపు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook
BJP-Janasena Alliance: బీజేపీతో జనసేన పొత్తు ఫైనల్.. 32 సీట్లలో పోటీ చేయాలనుకున్నాం..: పవన్ కళ్యాణ్