బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ అరెస్ట్ !

బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్‌ను అదుపులోకి తీసుకున్న హైదరాబాద్ పోలీసులు 

Last Updated : Aug 21, 2018, 11:19 AM IST
బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ అరెస్ట్ !

హైదరాబాద్‌లోని గోషామహల్ నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి ప్రాతినిథ్యం వహిస్తున్న బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ను ధూల్‌పేట్‌లో పోలీసులు అరెస్ట్ చేశారు. గోరక్షకులపై పోలీసులు తప్పుడు కేసులు పెట్టారని, ఆ తప్పుడు కేసులన్నీ కొట్టేయాలని డిమాండ్ చేస్తూ బషీర్‌బాగ్‌లోని పోలీసు కమిషనర్ కార్యాలయం ఎదుట నిరవధిక దీక్ష చేస్తానని ఇటీవల రాజాసింగ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే రాజాసింగ్‌ చేపట్టబోయే దీక్షకు అనుమతి లేనందున, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు చర్యగా ఆయనను అరెస్టు చేసినట్లు ధూల్‌పేట పోలీసులు తెలిపారు. అంతకన్నా ముందుగా మీడియాతో మాట్లాడిన రాజా సింగ్.. గోరక్ష కార్యకర్తలపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలని పోలీసులను డిమాండ్ చేశారు.

 

తాను గో రక్షణ ఉద్యమానికి పాటుపడుతుంటే, తన చర్యలను బీజేపీతో ముడిపెడుతున్నారని అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఇటీవలే రాజాసింగ్ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ఎమ్మెల్యే పదవితో పాటు బీజేపీ సభ్యత్వానికి సైతం రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించిన రాజాసింగ్.. తన రాజీనామా పత్రాన్ని పార్టీ అధ్యక్షులు డాక్టర్ కె లక్ష్మణ్‌కు పంపించారు.  
 

Trending News

By accepting cookies, you agree to the storing of cookies on your device to enhance site navigation, analyze site usage, and assist in our marketing efforts.

x