హైదరాబాద్: నగర వాసులు దీపావళి పర్వదినాన్ని పోలీసు ఆంక్షల మధ్య జరుపుకోవాల్సి ఉంది. రాత్రి 8 నుంచి 10 వరకే బాణాసంచాకు అనుమతి ఉంది . గడువు ముగిసిన తర్వాత బాణాసంచా కాల్చితే సుమోటోగా కేసులు చేస్తామని పోలీసు శాఖ హెచ్చిరించింది. ఈ మేరకు అన్ని పోలీస్ స్టేషన్లకు పోలీసుశాఖ ఆదేశాలు జారీ చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఈ నిబంధనలు అమలు చేస్తున్నామని పోలీసులు పేర్కొంటున్నారు.
దీపావళి సందర్భంగా కాల్చే బాణాసంచా వల్ల పొల్యూషన్ ఏర్పడుతున్న విషయం తెలిసిందే. ప్రజా ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని సుప్రీంకోర్టు ఈ మేరకు ఆదేశాలు చేసింది. కోర్టు ఆదేశాలను పోలీసులు ఈ మేరకు నిబంధనలు అమలు చేస్తున్నారు. దేశ రాజధాని సహా అన్ని రాష్ట్రాల్లోనూ ఇదే నిబంధన అమలు చేస్తున్నారు