Rahu Nakshatra Parivartan 2025 Effect On Zodiac Sign: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, అత్యంత కీడు గ్రహంగా పరిగణించే గ్రహాల్లో రాహువు ఒక్కటి.. అయితే ఈ గ్రహం ఒక రాశి నుంచి మరో ఇతర రాశిలోకి వెళ్లడానికి దాదాపు సంవత్సరంకు పైగా సమయం పడుతుంది. కానీ ఈ గ్రహం అప్పుడప్పుడు నక్షత్ర సంచారం కూడా చేస్తుంది. అయితే ఈ సంచారం కారణంగా కూడా అన్ని రాశివారి జీవితాల్లో అనేక మార్పులు వచ్చే అవకాశాలు ఉన్నాయి.
రాహువు గ్రహం జనవరి 12వ తేదిన ఉత్తరాభాద్రపద నక్షత్రంలోకి సంచారం చేయబోతోంది. అయితే ఈ గ్రహం చాలా ఏళ్ల తర్వాత నక్షత్రంలోకి ప్రవేశించబోతోంది. రాహువు నక్షత్ర సంచారం చేయడం వల్ల కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటే.. మరికొన్ని రాశులవారికి దుష్ప్రభావాలు కలుగుతాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. అయితే ఈ సంచారం వల్ల ఏయే రాశులవారికి ఎలా ఉంటుందో తెలుసుకోండి.
కర్కాటక రాశి
రాహువు నక్షత్ర మార్పుల కారణంగా కర్కాటక రాశివారికి అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి. అలాగే వీరికి సామాజిక ప్రతిష్టలు కూడా పెరుగుతాయని జ్యోతిష్యలు తెలుపుతున్నారు. అలాగే విద్యార్థులకు ఈ సమయం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. అలాగే ఈ సమయంలో పెట్టుబడులు పెట్టడం కూడా చాలా శుభప్రదమని.. వ్యాపారాలు కూడా మెరుగుపడే అవకాశాలు ఉన్నాయి.
మేష రాశి
రాహువు నక్షత్ర మార్పుల వల్ల మేష రాశి వారి కెరీర్ చాలా అద్భుతంగా ఉంటుంది. అలాగే ఆర్థిక పరమైన విషయాల పట్ల కూడా సానుకూల పెరిగే అవకాశాలు ఉన్నాయి. అలాగే విదేశీ ప్రయాలు చేసేవారికి ఈ సమయం ఎంతో అద్భుతంగా ఉంటుంది. వ్యాపారాలు చేసేవారికి బోలెడు ఆర్థిక లాభాలు కలుగుతాయి. అంతేకాకుండా ఆస్మిక ధన లాభాలు కూడా కలుగొచ్చు.
సింహరాశి
రాహువు ఎంతో శక్తివంతమైన నక్షత్రంగా పరిగణించే ఉత్తరాభాద్రపదంలోకి వెళ్లడం వల్ల సింహ రాశివారికి అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి. అంతేకాకుండా వీరికి వ్యాపారాల్లో ఒప్పందాలు కూడా ఖరారు అయ్యే అవకాశాలు ఉన్నాయి. చిన్న చిన్న వ్యాపారాలు ప్రారంభించాలనుకునేవారికి ఇది అద్భుతమైన సమయం.. ఉద్యోగాలు చేసేవారు శుభవార్తలు కూడా వింటారు.
వృశ్చిక రాశి
ఉత్తరాభాద్రపదం నక్షత్రంలోకి రాహువు ప్రవేశించడం వల్ల వృశ్చిక రాశివారికి మానసిక ప్రశాంతత కూడా రెట్టింపు అవుతుంది. అంతేకాకుండా కెరీర్‌కి సంబంధించిన విషయాల్లో కూడా అనేక మార్పులు వస్తాయి. విద్యార్థులు ఈ సమయంలో పోటీ పరీక్షలు రాయడం వల్ల విజయాలు సాధించే అవకాశాలు ఉన్నాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు.
(నోట్: ఇక్కడ అందించిన సమాచారం సాధారణ నమ్మకాలు, వాస్తవాలపై ఆధారపడి ఉంటుంది. దీనిని జీ తెలుగు న్యూస్ అస్సలు ధృవీకరించదు.)
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.