కేసీఆర్ మరోమారు ఫెడరల్ ఫ్రంట్ అంశాన్ని ప్రస్తావిస్తూ కేంద్రంలో అధికారాన్ని ఎలా సాధిస్తారో వివరించారు. తెలంగాణ భవన్ లో జరిగిన ఓ కార్యక్రమంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతూ మహాభారత యుద్ధంలో కౌరవులు వంద మంది.. పాండవులు ఐదుగురే! చివరికి గెలిచిందెవరు ? అని ప్రశ్నించారు..ఐదుగురితో కురుక్షేత్ర యుద్ధాన్ని గెలిచినప్పుడు..16 మందితో కేంద్రంలో అధికారం ఎందుకు సాధించలేమని కేటీఆర్ ప్రశ్నించారు.
ఇద్దరు ఎంపీల అండతోనే కేసీఆర్ దేశ రాజకీయ వ్యవస్థను తనకు అనుకూలంగా మార్చుకుని తెలంగాణ సాకారం చేసుకున్న ఘన చరిత్ర తమ సొంతమని.. అలాంటి 16 మందితో దేశ రాజకీయాలను ఎలా శాసిస్తామో ఎన్నికల తర్వాత చూపిస్తామని కేటీఆర్ పేర్కొన్నారు.
దాదాపు 60 ఏళ్లలో కాంగ్రెస్ పార్టీ దేశాన్ని ముందుకు తీసుకెళ్లలేకపోయిందని.. ఏదో అద్భుతం చేస్తారని నరేంద్ర మోదీ ఐదేళ్ల పాటు అధికారాన్ని అప్పగిస్తే ఆయన అట్టర్ ఫ్లాప్ అయ్యారని..దేశం ముందుకు వెళ్లాలంటే ఫెడరల్ ఫ్రంట్ ఒక్కటే మార్గమన్నారు. ఫెడరల్ ఫ్రంట్ కు నాంది తెలంగాణ గడ్డ నాంది అవుతుందన్నారు.