AP MLC Elections 2023: ఏపీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పుంజుకున్న టీడీపీ

AP MLC Elections 2023: ఏపీ గ్రాడ్యుయేట్‌ ఎన్నికల్లో టీడీపీ దూకుడు కొనసాగుతోంది. తూర్పు రాయలసీమ, ఉత్తరాంధ్రల్లో సైకిల్ అభ్యర్థులు ఆధిక్యంలో ఉన్నారు. 

AP MLC Elections 2023: ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ జోరుగా కొనసాగుతోంది. అయితే ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో టీడీపీ ప్రభంజనం సృష్టిస్తోంది. తూర్పు రాయలసీమలో మూడు రౌండ్లు పూర్తయ్యేసరికి టీడీపీ అభ్యర్థి మెజార్టీ సాధించాడు. మరోవైపు ఉత్తరాంధ్రలో కూడా టీడీపీ హవానే నడుస్తోంది. ఆరు రౌండ్లు పూర్తయ్యేసరికి తెదేపా అభ్యర్థి వేపాడ చిరంజీవిరావు 20వేల ఓట్లకుపైగా మెజార్టీతో దూసుకుపోతున్నారు.  

Trending News