Bionic Eye: ప్రపంచంలోనే తొలిసారిగా..కంటిచూపు తిరిగి తెచ్చే ప్రయోగం

సర్వేంద్రియానం నయనం ప్రధానం అంటారు పెద్దలు. కంటి చూపు లేకపోతే జీవితం పూర్తిగా అంధకారమే. కృత్రిమ కంటి కోసం ఆధునిక యుగంలో సాగుతున్న పరిశోధనలు విజయవంతమవుతున్నట్టు తెలుస్తోంది.

Last Updated : Sep 23, 2020, 12:55 PM IST
  • ప్రపంచంలోనే మొట్టమొదటి బయోనిక్ కన్ను
  • మెల్ బోర్న్ లోని మోనాష్ విశ్వవిద్యాలయంలో అభివృద్ధి
  • తొలి దశ మానవ క్లినికల్ ట్రయల్స్ కోసం సన్నాహాలు
Bionic Eye: ప్రపంచంలోనే తొలిసారిగా..కంటిచూపు తిరిగి తెచ్చే ప్రయోగం

సర్వేంద్రియానం నయనం ప్రధానం అంటారు పెద్దలు. కంటి చూపు ( Eye vision ) లేకపోతే జీవితం పూర్తిగా అంధకారమే. కృత్రిమ కంటి కోసం ఆధునిక యుగంలో సాగుతున్న పరిశోధనలు విజయవంతమవుతున్నట్టు తెలుస్తోంది. 

నయనం అన్నిఅవయవాల్లో ప్రధానమైనది కాబట్టే..నేత్ర దానం ( Eye donation ) అనేది కీలకంగా మారింది. కంటి చూపు లేకపోతే జీవితం ఎంత నరకప్రాయంగా ఉంటుందనేది మాటల్లో చెప్పలేం. కంటిచూపు లేని వారికి నేత్ర దానం ద్వారా కంటిచూపును తిరిగి తెచ్చేందుకు ప్రస్తుతం అవకాశాలు ఎక్కువే ఉన్నాయి కానీ నేత్ర దానం చేసేవాళ్లుండాలి. అందుకే కృత్రిమంగా కంటిచూపును అందించేందుకు శాస్త్రీయంగా పరిశోధనలు జరుగుతున్నాయి. ఈ పరిశోధనలు విజయవంతమైనట్టుగా ఫలితాలు వస్తున్నాయి. 

ఆస్ట్రేలియా ( Australia ) మెల్ బోర్న్ లోని మోనాష్ విశ్వవిద్యాలయం ( Monash university, Melbourne ) బయోనిక్ కన్నును అభివృద్ది చేసింది. ప్రపంచపు మొట్టమొదటి బయోనిక్ కన్ను( Bionic Eye ) తో మెదడు ఇంప్లాంట్ ద్వారా కంటిచూపు తిరిగి తెస్తామంటున్నారు.

మోనాష్ విశ్వవిద్యాలయానికి చెందిన ప్రొఫెసర్ ఆర్థర్ లోవరీ బయోనిక్ కన్ను గురించి వివరించారు. 172 స్పాట్ లైట్స్ ( ఫాస్పేన్స్ ) కలయిక నుంచి దృశ్య నమూనాను ఆవిష్కరిస్తుంది. ఇది వ్యక్తికి లోపలి మరియు బయటి సమాచారాన్ని చేరవేస్తుంది. అంతేకాకుండా చుట్టుపక్కలున్న వ్యక్తుల, వస్తువుల ఉనికిని గుర్తిస్తుంది అని చెప్పారు. లింబ్ పక్షవాతం, క్వాడ్రిప్లేజియా వంటి చికిత్స లేని రోగాలతో బాధపడుతున్నవారికి కూడా అడ్వాన్స్ సిస్టమ్ ద్వారా మెరుగుపర్చేందుకు చూస్తున్నట్టు పరిశోధకులు తెలిపారు. 

మొత్తంగా 2 వందల గంటల ట్రయల్స్ , పరిశీలనతో గొర్రెలపై చేసిన ప్రయోగాల్లో తక్కువ సైడ్ ఎఫెక్ట్స్ బయటపడ్డాయని పరిశోధకులు చెబుతున్నారు. మొట్టమొదటి మానవ క్లినికల్ ట్రయల్స్ ( First phase human clinical trials ) కోసం తరువాతి దశకు తీసుకెళ్తున్నామన్నారు. అది కూడా పూర్తయితే...ప్రపంచ గతిని, దిశను ఇది మార్చేస్తుందంటున్నారు పరిశోధకులు. అంతా విజయవంతమైతే తయారీ, పంపిణీ ప్రక్రియను వేగవంతం చేసేందుకు అవసరమైన నిధుల కోసం పరిశోధకులు ప్రయత్నిస్తున్నారు. Also read: China: కోల్డ్ వార్ , హాట్ వార్ లు మాకు అవసరం లేదు

Trending News