Pandora Papers Scandal 2021: మొన్న పనామా..నేడు పండోరో పేపర్స్ భాగోతం. రహస్య ఆర్ధిక లావాదేవీల వ్యవహారం ఇప్పుడు కుదిపేస్తోంది. పండోరో పేపర్స్ 2021 కుంభకోణంలో ఎవరెవరి పేర్లున్నాయి, ఎవరికి క్లీన్‌చిట్ లభించింది. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్‌కు క్లీన్‌చిట్ లభించిందా లేదా
పండోరో పేపర్స్ 2021 కుంభకోణం(Pandora papers scandal 2021) ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగానే కాకుండా దేశీయంగా కూడా కలకలం రేపుతోంది. రహస్య ఆర్ధిక లావాదేవీలకు సంబంధించిన వ్యవహారంలో ఇంటర్నేషనల్ కన్సోర్టియమ్ ఆఫ్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం స్థూలంగా చెప్పాలంటే ఐసీఐజే బయటపెట్టిన రహస్య డాక్యుమెంట్లు ఇప్పుడు సంచలనం కల్గిస్తున్నాయి. ఇందులో ప్రపంచవ్యాప్తంగా ప్రముఖుల పేర్లతో పాటు దేశంలోని ప్రముఖుల పేర్లు కూడా ఉన్నాయి.
ప్రపంచవ్యాప్తంగా 115 దేశాలు, 150 మీడియా సంస్థలు, 6 వందలమంది జర్నలిస్టుల నుంచి సమగ్ర దర్యాప్తు అనంతరం ఈ వివరాల్ని వెలువరించింది ఐసీఐజే(ICIJ)సంస్థ. ధనవంతుల కంపెనీలు, ట్రస్టులకు సంబంధించి 12 మిలియన్ల పత్రాల్ని సేకరించినట్టు సంస్థ తెలిపింది. పన్నుల బెడద లేని పనామా, దుబాయ్, మొనాకో, కేమన్ ఐలాండ్స్ వంటి దేశాల్లో బ్లాక్‌మనీని దాచుకునేందుకు, రహస్యంగా ఆస్థుల్ని కూడబెట్టేందుకు సూట్‌కేసు కంపెనీలకు సృష్టించారని వెల్లడించింది. రహస్యపు ఆర్ధిక లావాదేవీలకు సంబంధించిన పండోరా పేపర్స్ అందర్నీ కలవరపెడుతున్నాయి. ప్రముఖ నేతలు, అధికారులు, సెలెబ్రిటీలతో కలిపి మొత్తం 91 దేశాలకు చెందిన వ్యక్తులు ఇందులో ఉన్నారు. ఇందులో ఇండియా నుంచి 3 వందల పేర్లున్నాయి. ఇండియా నుంచి ఆరుగురు, పాకిస్తాన్ నుంచి ఏడుగురు రాజకీయ నేతల పేర్లున్నాయి. పండోరా పేపర్స్ ఉదంతం పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ను(Imran Khan) ఇరకాటంలో పడేసింది. ఈ జాబితాలో ఆయన సన్నిహితులు, బంధువులు, కుటుంబ సభ్యులు, కేబినెట్ మంత్రులకు కోట్ల డాలర్ల విలువైన కంపెనీలు, ట్రస్టులు ఉన్నాయని పండోరా పేపర్స్ వెల్లడించింది.
పండోరా పేపర్స్ 2021 జాబితాలో ప్రముఖ క్రికెటర్ సచిన్ టెండూల్కర్(Sachin Tendulkar)పేరు కూడా విన్పించింది. అయితే ఐసీఐజే నివేదిక సచిన్‌కు క్లీన్‌చిట్ ఇచ్చింది. సచిన్ విదేశీ పెట్టుబడులన్నీ సక్రమమేనని, ఇన్‌కంటాక్స్ అధికారులు సైతం ఈ విషయాన్ని ధృవీకరించినట్టు పండోరా పేపర్స్ నివేదిక స్పష్టం చేసింది. సచిన్ తో పాటు పాప్ సింగర్ షకీరా, సూపర్ మోడల్ మిస్ షిఫ్ఫర్‌లకు కూడా ఐసీఐజే నివేదిక క్లీన్‌చిట్ ఇచ్చింది. అయితే పండోరా పేపర్స్ నివేదికలోని వివరాలు కేవలం ఆరోపణలు మాత్రమే. దర్యాప్తు చేయించడం లేదా వదిలేయడమనేది ఆయా ప్రభుత్వాల నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. మొత్తానికి పండోరా పేపర్స్(Pandora Papers)పెద్ద దుమారమే లేపుతున్నాయి.
Also read: Zycov D Vaccine: త్వరలో చిన్నారులకు సైతం వ్యాక్సిన్, మరో మేకిన్ ఇండియా వ్యాక్సిన్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి