డీఎస్సీలో ఉత్తీర్ణులైన 2,645 మంది అభ్యర్ధులకు టీచర్ పోస్టులు

డీఎస్సీ 2018లో (AP DSC 2018) ఉత్తీర్ణత సాధించిన 2,645 మంది అభ్యర్థులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్ వెల్లడించింది. ఈనెల 22న జిల్లాల వారీగా ఎంపిక కమిటీ ఆధ్వర్యంలో అభ్యర్థులకు కౌన్సెలింగ్‌ నిర్వహించాలని, ఆదే రోజు నియామక పత్రాలు అందించాలని ఏపీ పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ చినవీరభద్రుడు ఆదేశాలు జారీ చేశారు.

Last Updated : Dec 21, 2019, 01:01 PM IST
డీఎస్సీలో ఉత్తీర్ణులైన 2,645 మంది అభ్యర్ధులకు టీచర్ పోస్టులు

అమరావతి : డీఎస్సీ 2018లో (AP DSC 2018) ఉత్తీర్ణత సాధించిన 2,645 మంది అభ్యర్థులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్ వెల్లడించింది. ఈనెల 22న జిల్లాల వారీగా ఎంపిక కమిటీ ఆధ్వర్యంలో అభ్యర్థులకు కౌన్సెలింగ్‌ నిర్వహించాలని, ఆదే రోజు నియామక పత్రాలు అందించాలని ఏపీ పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ చినవీరభద్రుడు శుక్రవారం ఆదేశాలు జారీ చేశారు. కోర్టు కేసులతో వాయిదా పడుతూవస్తోన్న ఖాళీలను కాకుండా మిగతా ఖాళీలను భర్తీ చేయాలని కమిషనర్ స్పష్టంచేశారు. 

ఏపీ పాఠశాల విద్యాశాఖ కమిషనర్‌ చినవీరభద్రుడు ఆదేశాల అనుసారం పాఠశాల విద్యాశాఖలో 1,544, ఆదర్శ పాఠశాలల్లో 645, బీసీ సంక్షేమ పాఠశాలల్లో 323, ఏపీ రెసిడెన్షియల్‌ స్కూల్స్‌లో 142 పోస్టులు భర్తీ కానున్నాయి. డీఎస్సీ-2018 ద్వారా మొత్తం 7,902 పోస్టులు నోటిఫై చేసినప్పటికీ.. ప్రస్తుతం తొలి జాబితాలో కోర్టు కేసులతో చిక్కులు లేని 2,645 పోస్టుల భర్తీకి ఉత్తర్వులు జారీ అయ్యాయి.

Trending News