close

News WrapGet Handpicked Stories from our editors directly to your mailbox

 'అమ్మ ఒడి' అమలు తేదీ ప్రకటించిన జగన్ సర్కార్

నవరత్నాల్లో ఒకటైన అమ్మవడి పథకానికి సంబంధించి విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ సభలో కీలక ప్రకటన చేశారు

Updated: Jul 11, 2019, 06:00 PM IST
 'అమ్మ ఒడి' అమలు తేదీ ప్రకటించిన జగన్ సర్కార్

'అమ్మ ఒడి' పథకం కోసం ఎప్పుడెప్పుడా అంటూ ఎదురుచూస్తున్న పేద తల్లిదండ్రులకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. వచ్చే ఏడాది జనవరి 26న నుంచి ఈ పథకం ప్రారంభించనున్నట్లు అసెంబ్లీ సాక్షిగా రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ ప్రకటించారు. 

ఈ సందర్భంగా మంత్రి ఆదిమూలపు సురేశ్  మాట్లాడుతూ పాఠశాలకు వెళ్లే విద్యార్థులతో పాటు ఇంటర్ విద్యార్థులకు కూడా 'అమ్మ ఒడి' పథకంతో లబ్ది చేకూరుతుందని పేర్కొన్నారు. అర్హులైన తల్లులకు ఈ పథకంలో భాగంగా ఏడాదికి రూ.15 వేలు ఇస్తామని వివరించారు. ఈ వ్యవధిలోపు లోపు ఈ పథకానికి సంబంధించిన విధి విధానలు రూపొందిస్తామని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్  పేర్కొన్నారు