చిత్తూరులో భూకంపం.. పరుగులు పెట్టిన జనం

చిత్తూరులో భూకంపం..

Last Updated : Sep 19, 2018, 12:02 PM IST
చిత్తూరులో భూకంపం.. పరుగులు పెట్టిన జనం

చిత్తూరు జిల్లాలో భూమి కంపించింది. బుధవారం తెల్లవారుజామున  ఐరాల మండలం ఐకే రెడ్డిపల్లిలో స్వల్ప భూకంపం సంభవించింది. కొన్ని సెకన్ష పాటు భూమి కంపించడంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు.  భూమిలో నుంచి భారీ శబ్ధాలు వచ్చాయంటున్నారు గ్రామస్తులు.. ఇళ్లలో నుంచి బయటకు పరుగులు తీశారు. భూమి కంపించడంతో ఇళ్ల గోడలు బీటలు వారాయి.

ఓ పక్క భారీ వర్షం... మరోవైపు భూకంప భయంతో గ్రామస్థులు నిద్రలేకుండానే గడిపారు. దీనికి తోడు మరోసారి భూకంపం వస్తుందనే భయం వారిని వెంటాడుతోంది.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అతిపెద్ద భూకంపం 1969 ఏప్రిల్ 13న కిచ్చెన్నపల్లి గొల్లగూడెం ప్రాంతంలో సంభవించింది. దీన్నే భద్రాచలం భూకంపం అంటారు.

హైదరాబాద్ నగరం భూకంపాల తీవ్రతలో రెండో జోన్ పరిధిలో ఉంది.

Trending News