పదో తరగతి విద్యార్థులకు ఉచిత ప్రయాణం

రాష్ట్ర వ్యాప్తంగా 10వ తరగతి పరీక్షలకు హాజరుకానున్న విద్యార్థులకు ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థ (ఏపీఎస్ఆర్టీసీ) ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించనుంది.

Last Updated : Mar 10, 2018, 08:50 PM IST
పదో తరగతి విద్యార్థులకు ఉచిత ప్రయాణం

విజయవాడ: రాష్ట్ర వ్యాప్తంగా 10వ తరగతి పరీక్షలకు హాజరుకానున్న విద్యార్థులకు ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థ (ఏపీఎస్ఆర్టీసీ) ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించనుంది. ఉచిత/రాయితీ బస్సు పాసు కలిగి ఉన్న విద్యార్థులు 10వ తరగతి పరీక్ష హాల్ టికెట్‌ను చూపించిన మీదట వారి నివాస ప్రాంతం నుండి పరీక్షా కేంద్రం వరకు వెళ్లేందుకు మరియు తిరిగి వచ్చేందుకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తారు. దూరం, పాసులో పేర్కొన్న గమ్యస్థానాలతో సంబంధం లేకుండా పరీక్షా కేంద్రం వరకు అనుమతిస్తారు.

ఈ ఉచిత ప్రయాణ సౌకర్యం 15- 03-2018 నుండి 28- 03-2018 తేదీల వరకు చెల్లుబాటు అవుతుంది. ఈ వ్యవధిలో ప్రభుత్వం ప్రకటించిన సెలవు దినాలు ఉన్నా గానీ ఉచిత ప్రయాణానికి పాస్ ఉన్న వాళ్లను అనుమతిస్తారు. అదే విధంగా హాల్ టికెట్ మరియు ఉచిత/రాయితీ బస్సు పాసు చూపించి, కాంబినేషన్ టికెట్ కొనుగోలు చేసి ఎక్స్‌ప్రెస్ బస్సులలో కూడా ప్రయాణం చేయవచ్చు.

Trending News