Makkah Floods: ముస్లిమ్స్ పవిత్రంగా భావించే మక్కాను భారీ వరదలు అల్లకల్లోలం చేస్తున్నాయి. క్లౌడ్ బరస్ట్ తో ఒక్కసారిగా అతి భారీ వర్షం కురిసింది. ఒక్కసారిగా వచ్చిన వరదలతో మక్కా ప్రాంతం చెరువులా మారింది. భారీగా కురిసిన వర్షంతో పలు ప్రాంతాల్లో కార్లు కొట్టుకుపోయాయి. బలమైన ఈదురుగాలులతో కూడిన వర్షం పడటంతో...చాలా చోట్ల చెట్లు నేలకొరిగాయాయి. మక్కా, మదీనా, జెడ్దాలో భారీ వరదల ప్రభావం ఎక్కువగా ఉంది. ఉరుములు, మెరుపులతో సుడిగాలులు విరుచుకుపడ్డాయి. దీంతో జనజీవనం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. మక్కాలో ఉమ్రా యాత్రకు వచ్చిన భక్తులు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొన్నారు. అంతేకాదు దర్శనానికి వచ్చిన లక్షలాది మంది వర్షం వల్ల పలు ఇబ్బందులను ఫేస్ చేసారు. రేపటి వరకు ఇదే పరిస్థితి ఉండే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
మక్కాకు సౌత్ సైడ్ ఉన్న అల్-అవాలి పరిసరాల్లో వరదల్లో చాలామంది చిక్కుకున్నారు. వీరిని రక్షించేందుకు స్థానికులతో కలిసి అధికారులు.. ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. వరదల్లో చిక్కుకున్న వారిని, గొలుసులు, తాళ్లతో రక్షించి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మరోవైపు వరదనీటిలో బైక్ తో పాటు చిక్కుకున్న డెలవరీ బాయ్ ను స్థానికులు రక్షించారు.
ఊహించని విధంగా వరదనీరు ముంచెత్తడంతో అనేక కార్లు, టూరిస్ట్ బస్సులు వరద నీటిలో కొట్టుకుపోయాయి. భారీ వర్షాలకు కూలిన చెట్లు వరద నీటి ప్రవాహంలో కొట్టుకుపోయాయి. మక్కా, మదీన, జెడ్దాలో చాలా ప్రాంతాల్లో రోడ్లు వర్షంతో తీవ్రంగా దెబ్బతిన్నాయి.
రెండు రోజులుగా కురిసిన వర్షంతో రియాద్, మక్కా, అల్-బాహా, తబుక్తో సహా ఇతర ప్రాంతాలు దారుణమైన పరిస్థితులు ఉన్నట్లు స్థానిక మీడియా తెలిపింది. మరో రెండు రోజుల పాటు ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు, ఉరుములు మెరుపులతో కూడిన ఈదురు గాలులు వీచే అవకాశం ఉన్నట్లు అక్కడి జాతీయ వాతావరణ కేంద్రం తెలిపింది. దీంతో సౌదీ అరేబియాలో రెడ్ అలర్ట్ జారీ చేశారు అధికారులు.
ఇదీ చదవండి: వెంకటేష్ భార్య నీరజా రెడ్డి గురించి ఎవరికీ తెలియని షాకింగ్ నిజాలు..
ఇదీ చదవండి: పెళ్లి తర్వాత భారీగా పెరిగిన శోభిత ఆస్తులు.. ఎవరి ఎక్స్ పెక్ట్ చేయరు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.