MBBS Merit List: ఏపీలో ఎంబీబీఎస్ కోర్సుల ఫైనల్ మెరిట్ లిస్ట్ విడుదల

MBBS Merit List 2024: నీట్ ఉత్తీర్ణులై ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశాలకై ఎందురు చూస్తున్న విద్యార్ధులకు కీలకమైన అప్‌డేట్ ఇది. తుది మెరిట్ లిస్ట్‌ను ఎన్డీఆర్ హెల్త్ యూనివర్శిటి విడుదల చేసింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.   

Written by - Md. Abdul Rehaman | Last Updated : Sep 12, 2024, 09:10 AM IST
MBBS Merit List: ఏపీలో ఎంబీబీఎస్ కోర్సుల ఫైనల్ మెరిట్ లిస్ట్ విడుదల

MBBS Merit List 2024: 2024-25 విద్యా సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ లోని ఆంధ్రా యూనివర్శిటీ, ఎస్వీ యూనివర్శిటీ పరిధిలోని ప్రభుత్వ, ప్రైవేట్ మెడికల్ కళాశాలల ఫైనల్ మెరిట్ లిస్ట్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటి రిలీజ్ చేసింది. కన్వీనర్ కోటాలో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకున్న వారి మెరిట్ లిస్ట్ ఇది. 

నీట్ 2024 కౌన్సిలింగ్ ప్రక్రియ నడుస్తోంది. ఏపీలోని వివిధ వైద్య కళాశాలల్లో ప్రవేశం కోసం చూస్తున్న విద్యార్ధులకై 2024-25 విద్యా సంవత్సరపు మెరిట్ లిస్ట్ విడుదలైంది. కన్వీనర్ కోటా సీట్లను నీట్ ర్యాంకులు, రిజర్వేషన్ ఆధారంగా ఫైనల్ చేశారు. ఆల్ ఇండియా కోటా మినహాయించగా మిగిలిన సీట్లలో కన్వీనర్ కోటా మెరిట్ జాబితాను ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ విడుదల చేసింది. ఏపీలో మెడికల్ అడ్మిషన్లకై దరఖాస్తు చేసుకున్నవారిలో 13,489 మందికి మెరిట్ ఆర్డర్ విడుదల చేశారు. పూర్తి వివరాలను ర్యాంకులు, మార్కులు, రిజర్వేషన్ వివరాలతో ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. ఆసక్తి కలిగిన విద్యార్దులు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీకు చెందిన ఈ లింక్ https://drntr.uhsap.in/index/notification/Admission/2024-25/MBBS/MBBS%20... క్లిక్ చేసి తెలుసుకోవచ్చు. 

నీట్‌లో 254వ ర్యాంకు పొందిన మోక్ష శ్రీకు ఏపీ మెరిట్ లిస్ట్‌లో మొదటి ర్యాంకు లభించింది. రెండో స్థానంలో నీట్ 304వ ర్యాంకర్ భవిత ఉంది. మూడో స్థానంలో నీట్ 551వ ర్యాంకర్ నియాతి జైన్ ఉన్నాడు. మొదటి పది ర్యాంకుల్లో ఐదుగురు బాలికలు, ఐదుగురు బాలురు ఉన్నారు. 

మరోవైపు ఏపీలోని దంత వైద్య కళాశాలల్లో పీజీ కోర్సు ఎండీఎస్ ప్రవేశాలకు కౌన్సిలింగ్ ప్రకటించింది ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటి. ఇప్పటికే మొదటి, రెండవ విడత కౌన్సిలింగ్ పూర్తి కాగా మిగిలిన కన్వీనర్, మేనేజ్ మెంట్ కోటా సీట్ల భర్తీకు స్ట్రే కౌన్సిలింగే చేపట్టనుంది. దీనికోసం సెప్టెంబర్ 12 వరకూ అభ్యర్ధులు ఆన్‌లైన్‌లో వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవాలి. మేనేజ్‌మెంట్ కోటాలో 62 సీట్లు ఉన్నాయి.

Also read: Lady Constables Selfie:జగన్ పర్యటనలో లేడీ కానిస్టేబుల్ అత్యుత్సాహం..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News