విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదాకు మద్దతు ప్రకటించాల్సిందిగా కోరుతూ ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా పోరాట సమితి నేతలు తాజాగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఓ లేఖ రాశారు. ఇవాళ ఉదయం కేసీఆర్ విశాఖలో పర్యటించిన నేపథ్యంలో ఆయనతో పాటు హైదరాబాద్‌లోని ప్రగతి భవన్‌కు ఓ లేఖను పంపిన సందర్భంగా ఈ విషయమై ప్రత్యేక హోదా పోరాట సమితి నేతలు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రజల భవిష్యత్ ప్రత్యేక హోదాపై ఆధారపడి వుందని హోదాకు ముడిపడి వున్న అన్ని అంశాలను ఈ లేఖలో ప్రస్తావించినట్టు తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌కి చెందిన ఎంపీలు ప్రత్యేక హోదా కోసం పార్లమెంట్లో పోరాడుతున్నప్పుడు టీఆర్ఎస్ ఎంపీలు అడ్డుపడటం ఏపీ ప్రజల మనోభావాలను దెబ్బతిస్తున్నందన.. ఇకపై తెలంగాణ సర్కార్ వైపు నుంచి ప్రత్యేక హోదాకు మద్దతు లభిస్తే తమకు మేలు చేకూర్చినవారు అవుతారని విజ్ఞప్తి చేసినట్టు వెల్లడించారు.