Taliban seize Pakistani military base: పాకిస్తాన్ కు భారీ షాక్ తగిలినట్లయ్యింది. ఆఫ్ఘనిస్తాన్‌కు ఆనుకుని ఉన్న ప్రాంతాల్లో పాకిస్తానీ సైన్యం, తెహ్రీక్-ఇ-తాలిబాన్ పాకిస్థాన్ యోధుల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ సైన్యంపై తెహ్రీక్-ఇ-తాలిబాన్ పాకిస్థాన్ భారీ విజయాన్ని సాధించింది. ఆఫ్ఘన్ మీడియా నివేదికల ప్రకారం, ఖైబర్ పఖ్తుంఖ్వాలోని బజౌర్ జిల్లాలో ఉన్న సలార్జాయ్‌లోని సైనిక స్థావరాన్ని తెహ్రీక్-ఇ-తాలిబాన్ పాకిస్థాన్ యోధులు స్వాధీనం చేసుకున్నారు.
ఆఫ్ఘనిస్తాన్‌లోని తూర్పు పాక్టికా ప్రావిన్స్‌లో నిషేధిత తెహ్రీక్-ఇ-తాలిబాన్ పాకిస్తాన్ ఆరోపించిన శిబిరాలను పాకిస్తాన్ యుద్ధ విమానాలు లక్ష్యంగా చేసుకున్నప్పటి నుండి టీటీపీ యోధులు పాకిస్తాన్‌పై యుద్ధం చేయడం గమనార్హం. గత కొన్ని రోజులుగా ఇరువర్గాల మధ్య భీకర కాల్పులు జరుగుతున్నాయి. శుక్రవారం రాత్రి ఉగ్రవాదులు సరిహద్దు దాటేందుకు ప్రయత్నించారని, అయితే పాక్ బలగాలు వారి ప్రయత్నాలను విఫలం చేశాయని భద్రతా వర్గాలను ఉటంకిస్తూ పాక్ మీడియా పేర్కొంది. చొరబాటు ప్రయత్నం విఫలమైన తరువాత, ఉగ్రవాదులు ఆఫ్ఘన్ దళాలతో చేరారు. శనివారం ఉదయం భారీ ఆయుధాలతో పాకిస్తాన్ స్థావరాలపై దాడి చేశారు.
ఆఫ్ఘన్ సైన్యం, ఉగ్రవాదులతో కలిసి ఘోజ్‌ఘర్హి, మాతా సంగర్, కోట్ రాఘా, తారీ మెంగల్‌తో సహా పలు పాకిస్తాన్ సరిహద్దు పోస్టులను లక్ష్యంగా చేసుకుంది. ఇప్పుడు సలార్జాయ్‌లోని సైనిక స్థావరాన్ని స్వాధీనం చేసుకోవడం టీటీపికి పెద్ద విజయంగా చెప్పవచ్చు. సైనిక స్థావరాన్ని స్వాధీనం చేసుకోవడానికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీనిలో టీటీపీ ఫైటర్లు స్థావరం వద్ద ఆయుధాలు ఊపుతూ తిరగడం మనం చూడవచ్చు.
TTP Seizes Military Base in Bajaur’s Salarzai Region
According to recent reports, Tehreek-e-Taliban Pakistan (TTP) fighters have taken control of a military base in Salarzai, located in Khyber Pakhtunkhwa's Bajaur district.
It is noteworthy that attacks on military forces in… pic.twitter.com/Nx5AqRefVQ
— Kabul Frontline (@KabulFrontline) December 30, 2024
కాగా రెండురోజుల క్రితం అఫ్టానిస్తాన్ పై పాకిస్తాన్ వైమానిక దాడులకు పాల్పడిన సంగతి తెలిసిందే. ఆప్ఘానిస్తాన్ లోని తూర్పు సరిహద్దు ప్రాంతంలోని కొన్ని స్థావరాలను లక్ష్యంగా చేసుకుని పాక్ జరిగిన దాడుల్లో 48 మంది పౌరులు మరణించినట్లు తాలిబాన్ ప్రభుత్వం తెలిపింది. మహిళలు, చిన్నారులు కూడా ఉన్నారని పేర్కొంది. ఈ దాడులకు ప్రతీకారం తీర్చుకుంటామని హెచ్చరించారు తాలిబాన్లు. ఇప్పుడు అన్నంత పనే చేశారు. ఏకంగా పాక్ సైనిక స్థావరాలను ఆక్రమించారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.