Atchutapuram fire explosion ap government annnounces 1 crore exgratia: అనకాపల్లిలో అచ్యుతాపురం సెజ్ లోని ఎసెన్షియా అడ్వాన్స్ డ్ సైన్సెస్ ఫార్మా కంపెనీలో బుధవారం సాయంత్రం పేలుడు సంభవించింది. రియాక్టర్ పేలుడు ధాటికి కంపెనీల పైకప్పు కూలిపోయింది. దీంతో ఒక్కసారిగా అక్కడి పనిచేస్తున్నవారికి ఏంజరిగిందో కూడా అర్థం అయ్యేలోపు.. విగత జీవులుగా మారిపోయారు. రియాక్టర్ పేలుడు ప్రభావానికి.. అక్కడ కార్మికులు శవాలు చెల్లచెదురుగా విసిరివేయబడ్డాయి. కార్మికుల శరీరాలు దూరంగా విసివేయబడినట్లు తెలుస్తోంది. కార్మికుల శరీరాలు 50 మీటర్ల ఎత్తువరకు ఎగిరి పడిపోయిట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో దాదాపు.. 60 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు.
ఈ ఘటనలో ఇప్పటి వరకు 18 మంది మరణించినట్లు తెలుస్తోంది. పేలుడు ధాటికి కార్మికులు శరీరాలు చెట్ల మీద కూడా పడిన ఘటనలు వెలుగులోకి వచ్చాయి. కనీసం ఎవరి శరీరం ఏంటో కూడా గుర్తు పట్టలేని విధంగా మారిపోయింది. ఇప్పటికి అనేక మంది కార్మిలకు డెడ్ బాడీలు శిథిలాల కింది చిక్కుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఎన్ డీఆర్ఎఫ్ సిబ్బంది పొక్లెయిన్ లతో శిథిలాలను తొలగించి డెడ్ బాడీలను గుర్తించినట్లు సమాచారం. ఇదిలా ఉండగా.. అచ్చుతాపురం ఘటనపై ఏపీ సీఎం తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు.
చనిపోయిన వారికుటుంబానికి రూ. 1 కోటిచొప్పును ప్రకటించారు. అంతేకాకుండా.. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారికి కూడా పరిహారం ఇస్తామని జిల్లాకలెక్టర్ హరిందర్ ఒక ప్రకటనలో వెల్లడించారు. ఎంత పరిహారం ఇస్తామనేది తొందరలో వెల్లడిస్తామన్నారు. మరోవైపు ఈ ఘటనపై కేంద్రం కూడా స్పందించింది. దేశ ప్రధానిమోదీ ఈ ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఇప్పటికే చనిపోయిన కుటుంబాలకు.. రూ. 2లకల చోప్పున పరిహారం, గాయపడిన వారికి రూ. 50 వేల పరిహారం అందించనున్నట్లు తెలిపారు.
అచ్యుతాపురం ఘటన జరగ్గానే ఏపీ హోమంత్రి వంగలపూడి అనిత హుటా హుటీన ఘటన స్థలానికి చేరుకున్నారు. మరోవైపు ఈ ఘటనను ఏపీ సర్కారు కూడా సీరియస్ గా తీసుకున్నట్లు తెలుస్తోంది. దీనిపై ఉన్నతస్థాయి విచారణకు ఆదేశాలు జారీచేశారు. ఈరోజు (గురువారం) సీఎం చంద్రబాబు బాధితులను పరామర్శించనున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా.. ఈరోజు చంద్రబాబు పర్యాటనతో ఉన్న నేపథ్యంలో.. మాజీ సీఎం వైఎస్ జగన్ తన పర్యటనను వాయిదావేసుకున్నట్లు తెలుస్తోంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.