YSRCP Viral Video: 'మా నమ్మకం నువ్వే జగన్‌' స్టిక్కర్ చింపి పట్టుకుపోయిన కుక్క..కేసులు పెడతారేమో?

Maa Nammakam Nuvve Jagan Sticker Dog Video: ఒక రోడ్డు మీద అతికించి ఉన్న మా నమ్మకం నువ్వే జగన్ అనే ఒక పోస్టర్ని ఒక నల్లటి వీధి కుక్క పైకెక్కి నోటితో కరుచుకుని పీక్కొని వెళ్ళిపోతున్న వీడియోని టీడీపీ వైరల్ చేస్తోంది. 

Written by - Chaganti Bhargav | Last Updated : Apr 11, 2023, 11:33 PM IST
YSRCP Viral Video: 'మా నమ్మకం నువ్వే జగన్‌' స్టిక్కర్ చింపి పట్టుకుపోయిన కుక్క..కేసులు పెడతారేమో?

Black Dog Tore Maa Nammakam Nuvve Jagan Sticker: ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్ రాజకీయమంతా స్టిక్కర్ల చుట్టూనే తిరుగుతున్న సంగతి తెలిసిందే. 2019 ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో అత్యధిక మెజారిటీతో గెలిచి ముఖ్యమంత్రిగా ఎన్నికైన జగన్ ఇప్పుడు 2024 ఎన్నికల మీద దృష్టి పెట్టారు. ఈసారి కూడా అధికారం తమదేనని బల్లగుద్ది చెబుతున్న ఆయన 175 సీట్లకు 175 సీట్లు వైసీపీ గెలుస్తోందని గంటా పధంగా చెబుతున్నారు.

అయితే ఇప్పటికే ఇంటింటికి మన ప్రభుత్వం పేరుతో ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న వైసీపీ ఇప్పుడు కొత్తగా మా నమ్మకం నువ్వే జగన్ అంటూ స్టిక్కర్ల కార్యక్రమాన్ని మొదలు పెట్టింది. వైసీపీ నేతలు స్వయంగా ఒక చేతి సంచి తగిలించుకుని ఈ స్టిక్కర్లను వైసీపీ ఏర్పాటు చేసుకున్న గృహసారధులు అనే వ్యక్తులతో కలిసి ఇంటింటికి తిరుగుతూ ఆ ఇంట్లోని వారికి సమ్మతం అయితే సదరు స్టిక్కర్లను ఇంటికి అతికిస్తున్నారు. సెల్ ఫోన్లకు కూడా ప్రత్యేకంగా స్టిక్కర్లు తయారు చేయించి సెల్ ఫోన్లకు కూడా అతికిస్తున్నారు.

ఇది కూడా చదవండి: CM Jagan Mohan Reddy: ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్.. వారి అకౌంట్లలో రేపే డబ్బులు జమ

అయితే ఈ విషయం మీద అధికార పార్టీని తెలుగుదేశం పార్టీ ముందు నుంచి గట్టిగానే టార్గెట్ చేస్తూ వస్తోంది. ఇదేం స్టిక్కర్ల రాజకీయం అంటూ ప్రశ్నిస్తూ వస్తోంది. ఇక గతంలో కంటే చాలా యాక్టివ్ గా ఉంటున్న టీడీపీ సోషల్ మీడియా పేజీలు కూడా ఎప్పటికప్పుడు జగన్ ఎలా దొరుకుతారో? ఎలా ట్రోల్ చేయాలా అంటూ ఎదురు చూస్తోంది.

తాజాగా ఒక రోడ్డు మీద అతికించి ఉన్న మా నమ్మకం నువ్వే జగన్ అనే ఒక పోస్టర్ని ఒక నల్లటి వీధి కుక్క పైకెక్కి నోటితో కరుచుకుని పీక్కొని వెళ్ళిపోతున్న వీడియో ఒకదాన్ని టీడీపీ అధికార ట్విట్టర్ అకౌంట్ నుంచి షేర్ చేశారు. షేర్ చేసి ‘’ఇప్పుడు దాని మీద కూడా కేసు బుక్ చేసి రకరకాల కోర్టులకు తిప్పి దాన్ని బతకనివ్వరేమో’’ అంటూ క్యాప్షన్ పెట్టారు. దానికి మరో నెటిజన్ రేపు సిఐడి వాళ్లు నోటీసు ఇస్తారు అంటూ మరో కామెంట్ చేశారు. ఇక ప్రస్తుతానికి తెలుగుదేశం పార్టీ ట్విట్టర్ హ్యాండిల్ నుంచి షేర్ చేయబడిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది, మీరు చూసేయండి.

ఇది కూడా చదవండి: AP CM YS Jagan: ఏపీలో దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడతున్నవారికి కోవిడ్‌ సోకితే..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

 
 

Trending News