అంబులెన్స్‌ని ఢీకొన్న కారు.. నలుగురు మృతి!

 హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు మరోసారి నెత్తురోడింది. రంగారెడ్డి జిల్లా ఆదిభట్ల పోలీస్‌ స్టేషన్ పరిధిలో శుక్రవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.

Updated: Jan 11, 2019, 09:52 AM IST
అంబులెన్స్‌ని ఢీకొన్న కారు.. నలుగురు మృతి!
File pic

హైదరాబాద్: హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు మరోసారి నెత్తురోడింది. రంగారెడ్డి జిల్లా ఆదిభట్ల పోలీస్‌ స్టేషన్ పరిధిలో శుక్రవారం తెల్లవారుజామున శంషాబాద్ నుంచి బొంగులూరు వైపు రాంగ్ రూట్‌లో వేగంగా వెళ్తున్న ఓ కారు రావిరాల వద్ద ఔటర్ రింగ్‌ రోడ్డుపై అదుపు తప్పి ఎదురుగా వస్తున్న మరో అంబులెన్స్‌ను ఢీకొట్టింది. ఈ రోడ్డు ప్రమాదంలో అంబులెన్స్‌లో వున్న నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా, ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. 

అంబులెన్స్‌లో ఏలూరు నుంచి బళ్లారిలోని ఆస్పత్రికి ఓ రోగిని తరలిస్తున్న క్రమంలో ఈ ప్రమాదం జరిగింది. మృతులు రామారావు, వెంకటేశ్వరరావు, సుబ్బలక్ష్మి, డ్రైవర్‌ శివగా గుర్తించారు. మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించినట్టు ఆదిభట్ల పోలీసులు తెలిపారు.