Chandrababu: ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణం చేసే స్థలం ప్రత్యేకత ఏమిటో తెలుసా?

Chandrababu Naidu Oath Ceremony Time And Date Set And You Know Place Speciality: ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణస్వీకారానికి సంబంధించి షెడ్యూల్‌, స్థలం ఎంపిక ఖరారైంది. అయితే ఆ ప్రాంతానికి ఎంతో ప్రత్యేకత ఉంది.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Jun 7, 2024, 09:37 PM IST
Chandrababu: ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణం చేసే స్థలం ప్రత్యేకత ఏమిటో తెలుసా?

CBN Oath Ceremony Time Date And Place: ఆంధ్రప్రదేశ్‌లో కొత్త ప్రభుత్వం కొలువుదీరడానికి ముహూర్తం ఖరారైంది. అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక మెజార్టీ స్థానాలతో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. విభజిత ఆంధ్రప్రదేశ్‌కు మరోసారి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఆయన ప్రమాణస్వీకారానికి ముహూర్తంతోపాటు వేదికను ఖరారు చేశారు.

Also Read: Chandrababu Promises: గెలిచారు సరే.. చంద్రబాబు సూపర్‌ సిక్స్‌ హామీలు నిలబెట్టుకుంటారా?

గన్నవరం విమానాశ్రయం సమీపంలోని కేసరపల్లి హెచ్‌సీఎల్ పక్కన జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న పొట్లూరి బసవరావుకి సంబంధించిన స్థలంలో ప్రమాణస్వీకార కార్యక్రమం జరగనుంది. ఈ మేరకు టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ప్రకటించారు.

Also Read: Amaravati Farmers: అపద్ధర్మ సీఎం జగన్‌కు అమరావతి రైతుల పంచ్‌.. పండ్లు, పూలతో తాంబూలం

ఇక ప్రమాణస్వీకారానికి ముహూర్తం కూడా ఖరారు చేశారు. ఈనెల 12వ తేదీ బుధవారం ఉదయం 11.27 గంటలకు ప్రమాణస్వీకారం చేయనున్నారు. స్థలం, ముహూర్తం ఖరారు కావడంతో కేసరపల్లి ఐటీ పార్క్‌ వద్ద చకాచకా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రితోపాటు కేంద్ర మంత్రులు, బీజేపీ ముఖ్యమంత్రులతోపాటు ఇతర ప్రముఖులు తరలిరానున్నారు. దీంతో పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే ఏర్పాట్లకు సామగ్రి అక్కడకు చేరుకున్నాయి.

టీడీపీ నాయకుల పరిశీలన
ప్రమాణస్వీకారం జరిగే ప్రాంతాన్ని తెలుగుదేశం పార్టీ నాయకులు పరిశీలించారు. ఆ పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడుతోపాటు మరికొందరు ఏర్పాట్లపై సమీక్షించారు. విమానాశ్రయానికి చేరుగా ఉండడంతో అన్నిటికీ  అనుకూలంగా ఈ ప్రాంతం ఉన్నట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ప్రభుత్వ అధికారులు, పోలీసులతో కూడా అచ్చెన్నాయుడు మాట్లాడారు. అయితే ప్రమాణస్వీకారానికి ఎంపిక చేసిన ప్రాంతం రాజధాని అమరావతికి చేరువగా ఉంది. దీంతో అమరావతి రాజధానిగా కొనసాగుతుందని ప్రమాణస్వీకారం రోజు చంద్రబాబు ప్రకటించే అవకాశం ఉంది. దీంతో రాజధాని రైతులు సంబరాలు వ్యక్తం చేస్తున్నారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిFacebookTwitter

Trending News