Eluru Result: ఏపీలో అధికార పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభంజనం కొనసాగింది. మున్సిపల్ ఎన్నికల్లో క్లీన్‌స్వీప్ ఖరారు చేసింది. రాష్ట్రంలో మిగిలిన ఒకే ఒక కార్పొరేషన్ ఫలితాలు వెలువడ్డాయి.
ఏపీలో జరిగిన మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లో(Ap Municipal Elections) అధికారపార్టీ విజయం సాధించిన విషయం తెలిసిందే. తాడిపత్రి మినహా మిగిలిన అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. అదే సమయంలో ఎన్నికలు జరిగిన కౌంటింగ్ ప్రక్రియ ఆగిపోయిన ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్ ఫలితాలు (Eluru Corporation Counting)ఇవాళ వెలువడ్డాయి. ఏలూరు కౌంటింగ్‌కు ఏపీ హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఇవాళ కౌంటింగ్ జరిగింది. ఏలూరులోని మొత్తం 50 డివిజన్లలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ(Ysr Congress party) 47 డివిజన్లలు గెల్చుకుని భారీ విజయం సాధించింది. ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ 3 స్థానాలకు పరిమితమైంది. జనసేన, బీజేపీలు ప్రభావం చూపలేకపోయాయి. కౌంటింగ్ ప్రారంభమైనప్పటి నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పూర్తి ఆధిక్యత ప్రదర్శిస్తూ వచ్చింది. వైసీపీ కైవసం చేసుకున్న 47 డివిజన్లలో 3 డివిజన్లు ఏకగ్రీవం కావడం విశేషం.
Also read: Karnataka: కర్ణాటక ముఖ్యమంత్రి మార్పుపై ఇవాళ క్లారిటీ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook