'రియల్ టైం గవర్నెన్స్' ప్రారంభించిన తరువాత ఏపీలో టెక్నాలజీ ఊపందుకుంది. కడప పోలీసులు కూడా ఈ సాంకేతికతను ఉపయోగించి దొంగను పట్టుకొని శభాష్ అనిపించుకుకున్నారు.
వివరాల్లోకి వెళితే.. కడప పోలీసులు ఎవరైనా ఇల్లు వదిలి వేరే ఊర్లకు వెళ్ళవలసి వస్తే 'ఎల్ హెచ్ఎంఎస్' అనే యాప్ ను డౌన్లోడ్ చేసుకోవాలని అన్నారు. అందులో వివరాలు నమోదు చేస్తే.. మేము మీ ఇంటికి కాపలా కాస్తామన్నారు. వారు చెప్పినట్టు వివరాలు నమోదు చేస్తే.. పోలీసులు ఇంటికి వచ్చి ఒక అలారం పెడతారు. మీరు ఇంట్లో లేని సందర్భంలో ఎవరైనా ఇంట్లోకి ప్రవేశిస్తే ఆ అలారం మోగుతుంది. వెంటనే పోలీసులు అక్కడకు చేరుకొని దుండగులను అరెస్ట్ చేశారు.
తాజాగా కడప పోలీసులు ఒక కేసును ఇలానే చేధించారు. కడపలో ఒక ఏరియాలో ఉన్న వ్యక్తి తాను ఇంట్లో ఉండనని.. ఇంటికి వచ్చి అలారం ఏర్పాటు చేయాలని 'ఎల్ హెచ్ఎంఎస్' లో వివరాలు నమోదు చేశాడు.రాత్రి ఒక దొంగ ఇంట్లో ఎవరూ లేరని తెలుసుకొని చేతివాటం ప్రదర్శించడానికి వచ్చాడు. అతను ఇంట్లో ప్రవేశించగానే పోలీసులకు కంట్రోల్ రూమ్ లో అలారం మోగింది. వెంటనే పోలీసులు అక్కడకు చేరుకొని దొంగని అరెస్టు చేశారు.