Aarogyasri Jobs 2022: నిరుద్యోగ యువతకు గుడ్ న్యూస్...ఆరోగ్య శ్రీలో ఉద్యోగాలకు నోటిఫికేషన్!

Aarogyasri Jobs: కృష్ణా జిల్లా నిరుద్యోగులకు శుభవార్త. ఆరోగ్య శ్రీలో పలు పోస్టుల భర్తీకి జిల్లా యంత్రాంగం నోటిఫికేషన్ జారీ చేసింది.   

Edited by - ZH Telugu Desk | Last Updated : Jun 6, 2022, 07:21 PM IST
Aarogyasri Jobs 2022: నిరుద్యోగ యువతకు గుడ్ న్యూస్...ఆరోగ్య శ్రీలో ఉద్యోగాలకు నోటిఫికేషన్!

Aarogyasri Jobs 2022 in Krishna District : కృష్ణా జిల్లా నిరుద్యోగ యువతకు గుడ్ న్యూస్. ఆరోగ్య శ్రీలో ఉద్యోగాలకు (Aarogyasri Jobs 2022) రాష్ట్రప్రభుత్వం (AP Govt) నోటిఫికేషన్ జారీ చేసింది. ఔట్‌సోర్సింగ్‌ ప్రాతిపదికన ఆరోగ్య మిత్ర, టీమ్‌ లీడర్‌ పోస్టులను కృష్ణా జిల్లా వైఎస్‌ఆర్‌ ఆరోగ్య శ్రీ హెల్త్‌ కేర్‌ ట్రస్ట్ భర్తీ చేయనుంది. ఇందుకోసం అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తుంది.

నోటిఫికేషన్ వివరాలు:

మెుత్తం పోస్టులు- 28 (ఆరోగ్య మిత్రలు-22, టీమ్ లీడర్లు-6)
దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం- జూన్ 6, 2022
దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ- జూన్ 11, 2022
దరఖాస్తు విధానం- ఆఫ్ లైన్
జీతం- ఆరోగ్య మిత్రలకు నెలకు రూ. 15వేలు, టీమ్ లీడర్లకు నెలకు రూ. 18, 500.
ఎంపిక ప్రక్రియ- విద్యార్హతలు, కంప్యూటర్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా 
నిర్వహణ కేంద్రం- మచిలీపట్నం
వయోపరిమితి- 42 ఏళ్ల లోపు వయసు ఉన్న వారు

విద్యార్హతలు:
ఆరోగ్య మిత్ర పోస్టులు- బీఎస్సీ నర్సింగ్, ఎమ్మెస్సీ నర్సింగ్, బీ.ఫార్మసీ, ఫార్మా-డీ, బీఎస్సీ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ డిగ్రీల్లో ఏదో ఒకటి పూర్తి చేసి ఉండాలి.  
టీమ్ లీడర్ పోస్టులు- పైన పేర్కొన్న విద్యార్హతలతోపాటు హాస్పిటల్ సర్వీసెస్‌లో కనీసం రెండేళ్ల పని చేసిన అనుభవం ఉండాలి.

Note: దరఖాస్తు ఫామ్‌తోపాటు అటెస్ట్ చేయించిన సర్టిఫికెట్ జెరాక్స్ కాపీలను జిల్లా కో ఆర్డినేటర్‌, డాక్టర్‌ వైఎస్‌ఆర్‌ ఆరోగ్య శ్రీ ట్రస్ట్‌ హెల్త్‌ కేర్‌ ట్రస్ట్‌, కృష్ణా జిల్లా, ఏపీ’ అడ్రస్‌కు జూన్ 11వ తేదీ సాయంత్రం 4 గంటలలోపు పంపాల్సి ఉంటుంది. 

Also Read: AP Govt: ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్‌..త్వరలో సాధారణ బదిలీలు..! 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News