Movie ticket prices issue: ఇష్టానుసారం వసూలు చేస్తామంటే కుదరదు-హీరో నానికి మంత్రి బొత్స కౌంటర్

Botsa Satyanarayana counter attack to hero Nani:   ఏపీలో సినిమా టికెట్ల ధరలపై హీరో నాని చేసిన వ్యాఖ్యలను మంత్రి బొత్స సత్యనారాయణ తప్పు పట్టారు. టికెట్ల ధరలను నియంత్రిస్తే ప్రేక్షకులను అవమానించడమెలా అవుతుందని ప్రశ్నించారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 23, 2021, 03:59 PM IST
  • హీరో నానికి మంత్రి బొత్స సత్యనారాయణ కౌంటర్
  • ప్రేక్షకుల మేలు కోసమే టికెట్ రేట్లను నియంత్రిస్తున్నామని కామెంట్
  • ఇష్టానుసారం వసూలు చేస్తామంటే కుదరదన్న మంత్రి
 Movie ticket prices issue: ఇష్టానుసారం వసూలు చేస్తామంటే కుదరదు-హీరో నానికి మంత్రి బొత్స కౌంటర్

Botsa Satyanarayana counter attack to hero Nani: శ్యామ్ సింగరాయ్ (Shyam Singha Roy) సినిమా విడుదల వేళ  ఏపీలో సినిమా టికెట్ల ధరలపై హీరో నాని చేసిన వ్యాఖ్యలు ప్రకంపనలు రేపుతున్నాయి. ఏపీలో సినిమా టికెట్ల ధరలపై నాని (Hero Nani) అసహనం వ్యక్తం చేయడం పట్ల ప్రభుత్వం నుంచి కౌంటర్స్ పడుతున్నాయి. తాజాగా మంత్రి బొత్స సత్యనారాయణ హీరో నాని చేసిన వ్యాఖ్యలను తప్పు పట్టారు. టికెట్ల ధరలను నియంత్రిస్తే ప్రేక్షకులను అవమానించడమెలా అవుతుందని ప్రశ్నించారు. ఇష్టానుసారం టికెట్ల రేట్లు వసూలు చేస్తామంటే కుదరదని తేల్చి చెప్పారు.

ప్రేక్షకులకు మేలు చేసేందుకు ప్రభుత్వం టికెట్ ధరలను నియంత్రిస్తోందని మంత్రి బొత్స పేర్కొన్నారు. ప్రభుత్వాన్ని సంప్రదించకుండా ఎవరి ఇష్టం వచ్చినట్లు వారు టికెట్ రేట్లు నిర్ణయించుకుంటే ఎలా అని ప్రశ్నించారు. ప్రభుత్వం ఒక విధానపరమైన నిర్ణయం తీసుకుందని... నిబంధనలు ఉల్లంఘించేవారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

సినీ నిర్మాత నట్టి కుమార్ (Natti Kumar) సైతం హీరో నాని వ్యాఖ్యలను తప్పు పట్టారు. ఏపీలో ఉన్న సినిమా టికెట్ ధరలు, కలెక్షన్లు, షేర్స్ గురించి అవగాహన లేకుండా నాని మాట్లాడుతున్నారని విమర్శించారు. ఇప్పుడున్న టికెట్ రేట్లపై హౌస్‌ఫుల్ కలెక్షన్లు వస్తే ఒకరోజుకు రూ.16 కోట్ల వసూళ్లు వస్తాయన్నారు. బీ, సీ సెంటర్లలో రూ.35 టికెట్‌ ఉండటమనేది అన్యాయమన్నారు. దీనిపై ప్రభుత్వాన్ని తాము అడుగుతున్నామని.. ఈ అంశం కోర్టు పరిధిలో ఉందని అన్నారు.

ఇలాంటి తరుణంలో ప్రభుత్వాన్ని విమర్శించడమేంటని మండిపడ్డారు. టికెట్ రేట్ల గురించి తెలియకుండా నాని (Hero Nani) మాట్లాడటం సరికాదని... ఏపీ ప్రభుత్వానికి నాని క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఇలాంటి వ్యాఖ్యలతో రాబోయే పెద్ద సినిమాలకు ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుందన్నారు. ప్రభుత్వం తమ డిమాండ్ పట్ల సానుకూలంగా స్పందిస్తుందనే నమ్మకం ఉందన్నారు.

Also Read: Kite Flying Incident: పండుగ రోజు అపశ్రుతి- గాలిపటంతో పాటు 30 అడుగులు గాల్లోకి.. తర్వాత ఏం జరిగిందంటే?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News