అమరావతి: ఏపీలో వైఎస్ జగన్ పాలనపై నారా లోకేష్ మరో సారి వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ''రావాలి జగన్-కావాలి జగన్'' అంటూ ఎన్నికల ప్రచారంలో తెగ అదరగొట్టి ..తీరా అధికారంలోకి వచ్చాక ''రావాలి కరెంట్.. కావాలి కరెంట్'' అనే పరిస్థితి తీసుకొచ్చారనే అర్థం వచ్చే రీతిలో సెటైర్లు సంధించారు.
లోకేష్ మాటల్లో చెప్పాలంటే....!!
జగన్ గారూ! మీరేమో అసెంబ్లీలో మీ జబ్బలు మీరే చరుచుకుని ఏదో ఘనకార్యం చేసినట్టు సెహబాష్ అనుకుంటున్నారు. కానీ క్షేత్ర స్థాయిలో పరిస్థితి మరోలా ఉంది. '' రావాలి కరెంట్- కావాలి కరెంట్'' అంటూ మీ ప్రభుత్వాన్ని, మీ పార్టీ గుర్తునీ ప్రజలు బతిమిలాడే పరిస్థితి వచ్చింది...కాస్త మీరు చీకట్లోంచి బయటకొచ్చి జనానికి కరెంటివ్వండి. ఈ ట్వీట్ కు కరెంట్ లేక అల్లాడుతున్న ఓ వీడియోను జత చేస్తూ లోకేశ్ ట్విట్టర్ లో పోస్ట్ చేశారు.
బయట చూస్తే ప్రజలంతా రావాలి కరెంట్, కావాలి కరెంట్ అని మీ ప్రభుత్వాన్ని, మీ పార్టీ గుర్తునీ బతిమిలాడుకుంటున్నారు. మీరు కాస్త చీకట్లోంచి బయటకొచ్చి జనానికి కరెంటివ్వండి.
Video courtesy:
Na Pranam TDP— Lokesh Nara (@naralokesh) July 24, 2019
''రావాలి కరెంట్.. కావాలి కరెంట్'' - జగన్ పాలనపై నారా లోకేష్ సెటైర్లు