చంద్రబాబుపై విజయసాయి రెడ్డి ఘాటు వ్యాఖ్యలు

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై వైఎస్సార్సీపీ నేత, రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. చంద్రబాబు ఏపీలో జన్మించడమే దురదృష్టకరమని విజయసాయి రెడ్డి ఘాటైన విమర్శలు చేశారు. 

Updated: Dec 15, 2019, 09:01 PM IST
చంద్రబాబుపై విజయసాయి రెడ్డి ఘాటు వ్యాఖ్యలు

విశాఖపట్నం: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై వైఎస్సార్సీపీ నేత, రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. చంద్రబాబు ఏపీలో జన్మించడమే దురదృష్టకరమని విజయసాయి రెడ్డి ఘాటైన విమర్శలు చేశారు. ఏపీలో చంద్రబాబు నాయుడు ఎటువంటి అభివృద్ది చేయలేదని... ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి రాష్ట్రాన్ని అభివృద్ధిపథంలో నడిపిస్తుంటే చూసి ఓర్వలేకే కోర్టుకు వెళ్లి స్టేలు తీసుకొచ్చి రాష్ట్రాభివృద్ధికి అడ్డంపడుతున్నారని మండిపడ్డారు. రాజధాని విషయంలో ఎక్స్‌పర్ట్‌ కమిటీ రిపోర్ట్‌ అధారంగా నిర్ణయం తీసుకోవడం జరుగుతుందని స్పష్టంచేశారు. 

ఈ సందర్భంగా అధికారుల బదిలీలపై విజయసాయి రెడ్డి స్పందిస్తూ.. పరిపాలనలో భాగంగా బదిలీలు సర్వ సాధారణమని, రాజకీయం చేయడం సరైంది కాదని అభిప్రాయపడ్డారు.