AP Assembly: ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 20 నుంచి, ఎజెండా ఏంటంటే

AP Assembly: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు జరిగి చాలా కాలమౌతోంది. అందుకే వర్షాకాల సమావేశాలకు సన్నాహాలు జరుగుతున్నాయి. వారం రోజులపాటు అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు జరగనున్నాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Sep 8, 2023, 12:31 PM IST
AP Assembly: ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 20 నుంచి, ఎజెండా ఏంటంటే

AP Assembly: ఏపీ అసెంబ్లీకు సంబంధించిన బడ్జెట్ సమావేశాలు చివరివి. దాదాపు ఆరు నెలలు కావస్తుండటంతో ఇప్పుడు వర్షాకాల ప్రత్యేక సమావేశాలు నిర్వహించేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమైంది. ఈ నెల అంటే సెప్టెంబర్ 20 నుంచి వర్షాకాల ప్రత్యేక సమావేశాలు నిర్వహించనున్నారు. 

ఏపీలో బడ్జెట్ సమావేశాల తరువాత మళ్లీ అసెంబ్లీ సమావేశాలు జరగలేదు. ఆరు నెలల వ్యవధిలో తప్పనిసరిగా అసెంబ్లీ జరగాల్సి ఉంటుంది. ఈ క్రమంలో సెప్టెంబర్ 20 నుంచి వారం రోజులపాటు అసెంబ్లీ సెషన్ నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధమౌతోంది. ప్రభుత్వం అధికారికంగా ఇంకా తేదీ ప్రకటించలేదు. అసెంబ్లీ సమావేశాలకు ముందు కేబినెట్ భేటీ కానుంది. ఈ భేటీలో పలు కీలకాంశాలపై కేబినెట్ తీర్మానం చేయనుంది. ఆర్దిక, ప్రణాళికా పరమైన నిర్ణయాలకు ఆమోదముద్ర వేయనుంది. బడ్జెట్ సెషల్ మొత్తం తెలుగుదేశం పార్టీ ఆందోళనతో రచ్చగా మారింది. ఈసారి వర్షాకాల ప్రత్యేక సమావేశాలు సజావుగా జరుగుతాయా లేదా అనేది చర్చనీయాంశమౌతోంది.

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ లండన్ పర్యటన నుంచి సెప్టెంబర్11న తిరిగి రానున్నారు. ముఖ్యమంత్రి జగన్ వచ్చిన తరువాత పార్టీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు కానుంది. గడప గడపకు ప్రభుత్వంపై సమీక్ష, ఐప్యాక్ ప్రతినిధులు ఇచ్చిన డేటా ఇలా వివిధ అంశాలపై చర్చ జరగనుంది. 

ఇక వచ్చే ఏడాది న్నికల నేపధ్యంలో ఏపీ అసెంబ్లీ ఎజెండాలో కీలక నిర్ణయాలుండవచ్చని తెలుస్తోంది. వచ్చే ఏడాది పెంచాల్సిన పెన్షన్‌ను ఈ సమావేశాల్లోనే పెంచే అవకాశాలు కన్పిస్తున్నాయి. 

Also read: King Cobra Viral Video: 13 అడుగుల గిరినాగును రిస్క్‌ చేసి పట్టుకున్న స్నేక్‌ క్యాచర్‌..వీడియో చూస్తే షాక్‌ అవుతారు!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News