/telugu/photo-gallery/hero-sai-durga-tej-emotional-with-his-mama-pawan-kalyan-pics-goes-viral-rv-180879 Sai Durga Tej: డిప్యూటీ సీఎంతో సాయి దుర్గా తేజ్‌ సంబరాలు.. భావోద్వేగంలో మామ అల్లుడు Sai Durga Tej: డిప్యూటీ సీఎంతో సాయి దుర్గా తేజ్‌ సంబరాలు.. భావోద్వేగంలో మామ అల్లుడు 180879

New Birth Registration Rule: మనకు ఆధార్ కార్డు ఎంతో ముఖ్యమో బర్త్ సర్టిఫికేట్ కూడా అంతే ముఖ్యం. తాజాగా జనన నమోదు ప్రక్రియలో భారీ మార్పులు చేస్తోంది కేంద్ర హోం మంత్రిత్వ శాఖ. ఇకపై పుట్టిన ప్రతి బిడ్డ జనన ధృవీకరణ పత్రంలో తల్లిదండ్రులు యెుక్క మతానికి సంబంధించిన సమాచారం కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు నమోదు ప్రక్రియలో కేవలం కుటుంబం యొక్క మతం వివరాలు ఇస్తే సరిపోయేది, కానీ ఇకపై విడిగా తల్లిదండ్రుల మతానికి సంబంధించిన వివరాలు నమోదు చేయాల్సి ఉంది. దీనిపై హోం మంత్రిత్వ శాఖ డ్రాఫ్ట్ కాపీని సిద్దం చేసింది. అంతేకాకుండా ఈ ముసాయిదాను రాష్ట్రప్రభుత్వాలకు కూడా పంపింది. 

దీని కోసమే కొత్త కాలమ్‌..
ఇంతకుముందు, పిల్లల పుట్టుకకు సంబంధించిన రిజిస్ట్రేషన్ ఫారమ్ నంబర్ 1లో కుటుంబం యొక్క మతం కోసం కాలమ్ ఉండేది. అయితే ఇప్పుడు దానికి మరో కాలమ్ జోడించబడింది. ఈ కాలమ్‌లో పిల్లల తల్లిదండ్రుల మతానికి సంబంధించిన సమాచారాన్ని నమోదు చేయాల్సి ఉంటుంది. దత్తత ప్రక్రియ కోసం కూడా ఫారమ్ నంబర్ 1 అవసరం ఉంటుంది. గత సంవత్సరం ఆమోదించిన జనన-మరణాల నమోదు (సవరణ) చట్టం ప్రకారం, ఈ మార్పులు తీసుకొస్తున్నారు. 
కొత్త ఫారమ్ నంబర్ 1 ఉంటే చాలు..
మీడియా కథనాల ప్రకారం, నేషనల్ పాపులేషన్ రిజిస్టర్ (NPR), ఆధార్ కార్డ్, ఓటరు జాబితా, రేషన్ కార్డ్, పాస్‌పోర్ట్ మరియు డ్రైవింగ్ లైసెన్స్ వంటి పత్రాలు జనన నమోదు యొక్క కొత్త ఫారమ్ నంబర్ 1 నుండి పొందిన డేటా ఆధారంగా అప్ డేట్ చేయబడతాయి. పిల్లల పుట్టుకకు సంబంధించిన ఈ డిజిటల్ సర్టిఫికేట్ ఒకే డాక్యుమెంట్‌గా చెల్లుబాటు అవుతుంది. ఇది మాత్రమే కాదు, ఏదైనా పాఠశాల లేదా కళాశాలలో అడ్మిషన్ సమయంలో జనన ధృవీకరణ పత్రంగా కూడా చెల్లుబాటు అవుతుంది.

Also Read: Post Office Scheme: పైసా వసూల్ స్కీమ్.. రోజుకు రూ.50 ఆదా చేస్తే.. చేతికి రూ.35 లక్షలు

ఇకపై ఆ సమాచారం ఇవ్వాల్సిందే..
అంతే కాకుండా, ఇప్పుడు ఎవరైనా చనిపోతే వారి యెుక్క డెత్ సర్టిఫికెట్‌లో ఇటీవలి మరణానికి గల కారణాలతో పాటు పాత వ్యాధికి సంబంధించిన సమాచారం ఇస్తున్నాం. ఇకపై రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా (RGI) మరణ ధృవీకరణ పత్రంలో తక్షణ కారణంతో పాటు దీర్ఘకాలిక వ్యాధికి సంబంధించిన సమాచారాన్ని ఇవ్వడం తప్పనిసరి చేసింది. ఆర్జీఐ దేశవ్యాప్తంగా జనన మరణాల డేటాను జాతీయ స్థాయిలో నిర్వహిస్తుంది.

Also Read: UPI New Feature: యూపీఐలో సరికొత్త ఫీచర్, ఇక నుంచి యూపీఐతో క్యాష్ డిపాజిట్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Section: 
English Title: 
central govt will compulsory for parents religion Information in New Birth Registration Process sn
News Source: 
Home Title: 

New Birth Registration Rule: బర్త్ సర్టిఫికేట్ రిజిస్ట్రేషన్ ప్రక్రియలో కీలక మార్పులు.. ఇకపై ఆ సమాచారం తప్పనిసరి! 
 

New Birth Registration Rule: బర్త్ సర్టిఫికేట్ రిజిస్ట్రేషన్ ప్రక్రియలో కీలక మార్పులు.. ఇకపై ఆ సమాచారం తప్పనిసరి!
Caption: 
Representational Image
Yes
Is Blog?: 
No
Tags: 
Facebook Instant Article: 
Yes
Mobile Title: 
బర్త్ సర్టిఫికేట్ రిజిస్ట్రేషన్ ప్రక్రియలో కీలక మార్పులు..ఇకపై ఆ సమాచారం తప్పనిసరి!
Samala Srinivas
Publish Later: 
No
Publish At: 
Saturday, April 6, 2024 - 16:59
Request Count: 
19
Is Breaking News: 
No
Word Count: 
304